KGF Chapter 2: తొలి దక్షిణాది సినిమాగా.. ఆ రికార్డు ‘కేజీయఫ్‌ 2’దే

కన్నడ హీరో యశ్‌ (Yash) అభిమానులతోపాటు సగటు సినీ ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కేజీయఫ్ ఛాప్టర్‌ 2’. (KGF Chapter 2) ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. విడుదల విషయంలో ఓ ఘనత సాధించింది.

Published : 05 Apr 2022 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ హీరో యశ్‌ (Yash) అభిమానులతోపాటు సగటు భారతీయ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కేజీయఫ్ ఛాప్టర్‌ 2’ (KGF Chapter 2). ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. విడుదల విషయంలో ఓ ఘనత సాధించింది. గ్రీస్‌ దేశంలో విడుదలకానున్న తొలి దక్షిణాది సినిమాగా నిలిచింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అక్కడి ప్రేక్షకుల్ని అలరించనుంది. ఇటలీలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్‌ అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను పంచుకుంది.

యశ్‌- ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 1’ అనూహ్య విజయం అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో.. దానికి కొనసాగింపుగా రూపొందిన ఛాప్టర్‌ 2పై యావత్‌ సినీ అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌.. సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి నటించగా సంజయ్‌ దత్‌, రవీనా టాండన్‌, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 14న విడుదలకానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని