Kiran Abbavaram: హీరోయిన్‌ను పెళ్లాడనున్న కిరణ్‌ అబ్బవరం.. ఎంగేజ్‌మెంట్‌ ఎప్పుడంటే..?

నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. తన తొలి సినిమా హీరోయిన్‌ను ఆయన వివాహం చేసుకోనున్నారు.

Published : 11 Mar 2024 16:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యువ నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. తన తొలి సినిమా హీరోయిన్‌ రహస్య గోరక్‌ను ఆయన పెళ్లి చేసుకోనున్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మార్చి 13న నిశ్చితార్థం జరగనుంది. హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ రిసార్ట్స్‌లో అతి తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పెళ్లి జరిగే అవకాశం ఉందని టాక్‌.

‘రాజావారు రాణిగారు’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కిరణ్‌ అబ్బవరం. ఇందులో రహస్య కథానాయిక పాత్ర పోషించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అలాంటిది ఏమీ లేదని.. రహస్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని కిరణ్‌ ఓ సందర్భంలో చెప్పారు. సినిమాల విషయానికి వస్తే.. గతేడాది ‘వినరో భాగ్యము విష్ణు కథ’, ‘మీటర్‌’, ‘రూల్స్‌ రంజన్‌’ చిత్రాలతో కిరణ్‌ అబ్బవరం ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ‘దిల్‌ రుబా’, 1970 దశకం నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. ‘రాజావారు రాణి గారు’ తర్వాత ‘షర్బత్’ అనే తమిళ చిత్రంలో నటించారు రహస్య.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని