ఒకేసారి ఇద్దరితో డేట్‌ చేయొద్దని నా కుమార్తెకు చెబుతా: స్టార్‌హీరో సతీమణి

సెలబ్రిటీ ఇంటీరియర్‌ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకొని కెరీర్‌లో రాణిస్తున్నారు బాలీవుడ్‌ స్టార్‌హీరో షారుఖ్‌ ఖాన్‌ సతీమణి గౌరీ ఖాన్‌. కెరీర్‌పరంగా ఎంతో....

Updated : 19 Sep 2022 15:47 IST

ముంబయి:  ఇంటీరియర్‌ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకొని కెరీర్‌లో రాణిస్తున్నారు బాలీవుడ్‌ స్టార్‌హీరో షారుఖ్‌ ఖాన్‌ సతీమణి గౌరీ ఖాన్‌. ఈక్రమంలోనే తాజాగా ఆమె ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో సందడి చేశారు. కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తన స్నేహితులు భావన పాండే, మహీప్‌ కపూర్‌లతో కలిసి ఆమె పాల్గొన్నారు. కరణ్‌ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు. 

‘‘డేటింగ్‌ విషయంలో మీ కుమార్తె సుహానా ఖాన్‌కు మీరిచ్చే సలహా ఏమిటి?’’ అని కరణ్‌ ప్రశ్నించగా.. ‘‘ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలతో డేట్‌ చేయొద్దని చెబుతా’’ అని గౌరీ బదులిచ్చారు. అనంతరం షారుఖ్‌తో తన ప్రేమకథకు ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ టైటిల్‌ పెడతానని ఆమె చెప్పుకొచ్చారు. తమ ప్రేమకథలో గొడవలున్నాయని ఆమె తెలిపారు. అనంతరం, ‘‘ఒకవేళ మీకు ఏదైనా సినిమాలో నటించే అవకాశం వస్తే హీరోగా మీ సరసన ఎవరు నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు?’’ అని మహీప్‌కపూర్‌ని కరణ్‌ ప్రశ్నించాడు. ‘‘హృతిక్‌రోషన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉంది. మా ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉంటుందని నమ్ముతున్నా’’ అని మహీప్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని