Cinemanews: ‘క్రాక్‌’ నుంచి అదిరిపోయే బస్టాండ్‌ ఫైట్‌ సీన్‌

మాస్‌ మహారాజా రవితేజ తెరపై కనిపిస్తేనే అభిమానులు ఈలలు వేసి గోల చేస్తారు. రవితేజ పోలీస్‌ అధికారిగా విలన్లను పరిగెత్తించి కొడుతూ ఫైట్‌ చేస్తే పూనకాలు వస్తాయి. రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘క్రాక్‌’. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రుతిహాసన్‌

Published : 01 Jul 2021 23:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాస్‌ మహారాజా రవితేజ తెరపై కనిపిస్తేనే అభిమానులు ఈలలు వేసి గోల చేస్తారు. రవితేజ పోలీస్‌ అధికారిగా విలన్లను పరిగెత్తించి కొడుతూ ఫైట్‌ చేస్తే పూనకాలు వస్తాయి. రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘క్రాక్‌’. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రుతిహాసన్‌ సందడి చేసింది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, సముద్రకని కీలకపాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. మధు నిర్మాత. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆహాలో సినిమా ప్రసారం అవుతోంది. కాగా.. ఈ సినిమాలో బాగా పాపులర్‌ అయిన బస్టాండ్‌ ఫైట్‌ సన్నివేశాన్ని ప్రసార ఓటీటీ సంస్థ ‘ఆహా’ యూట్యూబ్‌లో పంచుకుంది. ఆలస్యమెందుకు మీరూ చూసేయండి మరి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని