Kriti Sanon: విభిన్నమైన పాత్రల్లో నటించగలను: కృతి సనన్‌

బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ బ్యాక్‌గ్రౌండ్ లేకుంటే సినిమా అవకాశాలు తొందరగా రావన్నారు.

Published : 07 Apr 2024 20:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు కథానాయిక కృతి సనన్‌ (Kriti Sanon). తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘ది క్రూ’ సక్సెస్‌ మీట్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బంధుప్రీతి గురించి మాట్లాడారు. ‘‘కెరీర్‌ ప్రారంభంలో మంచి సినిమాల్లో నటించే అవకాశాలు రాలేదు. అప్పుడు ఎంతో నిరుత్సాహానికి గురయ్యాను. నటిగా నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని ఒక దశలో విరామం లేకుండా సినిమాలు చేశాను. నేను కూడా అన్ని రకాల జోనర్‌ సినిమాలు, విభిన్నమైన పాత్రల్లోనూ నటించగలను. నా సామర్థ్యానికి తగ్గ పాత్రల్లో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. బాలీవుడ్‌లో బంధుప్రీతి ఎక్కువ. నేపథ్యం ఉన్న వారికే మంచి అవకాశాలు వస్తాయి. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేని వారికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించే అవకాశం రావాలంటే టైమ్‌ పడుతుంది’’ అని కృతిసనన్‌ పేర్కొన్నారు. గతంలో ఆమె నెపోటిజం కారణంగా ఓ హిట్‌ మూవీలో నటించే అవకాశం దూరమైందని చెప్పిన విషయం తెలిసిందే. 

ఆమె నటించిన తాజా చిత్రం ‘ది క్రూ’. కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో టబు, కరీనా కపూర్‌ఖాన్‌లతో కలిసి కృతి నటించారు. దర్శకుడు రాజేశ్‌ కృష్ణన్‌ దీనిని తెరకెక్కించారు. ఒకేచోట పనిచేసే ముగ్గురి మహిళల జీవితంలో ఎదురైన పరిస్థితులను వారు ఏ విధంగా ఎదుర్కొన్నారనే కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. మార్చి 29న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా రూ.100కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్ర బృందం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని