RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బ్రిడ్జ్‌ సీక్వెన్స్‌.. రాజమండ్రితో సంబంధం ఏమిటంటే..

భారతీయ చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవాన్ని అందించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి రూపొందించిన ఈసినిమాలో రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రలు పోషించారు....

Updated : 07 Dec 2022 14:40 IST

హైదరాబాద్‌: భారతీయ చిత్ర పరిశ్రమకు పూర్వ వైభవాన్ని అందించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి రూపొందించిన ఈసినిమాలో రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. కాగా, ఈ సినిమాలో రామ్‌చరణ్‌-తారక్‌లు మొదటిసారి కలుసుకున్నప్పుడు చూపించే బ్రిడ్జ్‌, ట్రైన్‌ యాక్సిడెంట్‌ సీక్వెన్స్‌లు ప్రేక్షకుల చేత ఔరా అనిపిస్తున్నాయి. రాజమౌళి టేకింగ్‌ని, కెమెరా పనితనాన్ని, వీఎఫ్‌ఎక్స్‌.. ఇలా టీమ్‌ మొత్తాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు వీఎఫ్‌ఎక్స్‌ ఎలా క్రియేట్‌ చేశారో తెలియజేస్తూ తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ముఖ్యంగా ‘బ్రిడ్జ్‌ సీక్వెన్స్‌’ క్రియేట్‌ చేయడం కోసం డెన్మార్క్‌కు చెందిన ఓ బృందం ప్రత్యేకంగా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ చేసింది. రైల్వే బ్రిడ్జ్‌, దాని చుట్టు పక్కల ఉండే గ్రామీణ వాతావరణాన్ని క్రియేట్‌ చేయడం కోసం ఆ బృందం రాజమండ్రికి చేరుకుని.. గోదావరి బ్రిడ్జ్‌.. దాని పరిసరాలను పరిశీలించి, ఫొటోలు తీసుకుంది. అనంతరం డెన్మార్క్‌ చేరుకుని వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ ప్రారంభించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైన్‌ సీన్‌ వీఎఫ్‌ఎక్స్‌ ఎలా జరిగిందో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని