Updated : 06 Jul 2022 11:59 IST

Lavanya Tripati: గన్స్‌ మోయడం కష్టమే!

‘‘ఇలాంటి పాత్రలే చేయాలని ఆలోచించను. నటిగా బలమైన పాత్రలే చేయాలనుకుంటా. చేసినవే మళ్లీ చేయడం నచ్చదు. అందుకే అందరికీ నేను  సినిమాలు తగ్గించినట్లు అనిపిస్తుండొచ్చు’’ అంది నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripati). ఆమె ప్రధాన పాత్రలో రితేష్‌ రాణా తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ బర్త్‌డే’ (Happy Birthday). క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జులై 8న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది లావణ్య.

ఈ సినిమాలో మొదటిసారి గన్‌ పట్టుకున్నారు. ఎలా అనిపించింది?

చాలా కొత్తగా. నేను రోజూ జిమ్‌, బాక్సింగ్‌ చేస్తాను. తొలిసారి తెరపై నా యాక్షన్‌ చూపించే అవకాశం దక్కింది. ఈ సినిమాని నేను ఎంజాయ్‌ చేస్తూ చేశా. గన్స్‌ మోయడం కష్టంగా అనిపించింది. ఇందులో అన్నీ    నిజమైన తుపాకులే వాడాం. ట్రైలర్‌లో కనిపించే ఓ పెద్ద గన్‌ తొమ్మిది కేజీలకు పైనే ఉంటుంది. దాన్ని మోస్తూ షూట్‌ చేయడం అంత సులువు కాదు.

చిత్ర కథేంటి? మీ పాత్ర ఎలా ఉంటుంది?

కొత్త జానర్‌ ఇది. ఒక కల్పిత ప్రపంచంలో జరిగే కథ. దానికి ఎలాంటి హద్దులు ఉండవు. ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్నకు తావుండదు. ఎందుకంటే అది ఊహాజనితం. నేనిందులో హ్యాపీ అనే పాత్ర చేశా. నా బర్త్‌డే పార్టీలో జరిగే కొన్ని ఆసక్తికర సంఘటనల సమాహారమే ఈ చిత్రం.

ఇలాంటి క్రైమ్‌ కామెడీ ఎలా అనిపించింది?

మామూలుగా నాయికా ప్రాధాన్య చిత్రాలనగానే చాలా సీరియస్‌గా ఉండే పాత్రలే వస్తుంటాయి. కానీ, ఇలాంటి ఎంటర్‌టైనర్‌లో లీడ్‌ రోల్‌ రావడం అరుదు. అలాంటి అవకాశం నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. రితేష్‌ నన్ను ఒక ఇంటర్వ్యూలో చూసి ఈ హ్యాపీ పాత్రను రాసుకున్నారట. నేను తెరపై చేసిన కొన్ని పాత్రల వల్ల.. నన్ను చాలామంది సీరియస్‌ పర్సన్‌ అనుకుంటారు.  నిజానికి నేను చాలా సరదాగా ఉంటాను.

ఇప్పటివరకు చేసిన పాత్రల్లో బాగా సవాల్‌గా అనిపించింది ఏది?

‘‘అందాల రాక్షసి’లో నేను చేసిన మిథున పాత్రే. ఆ చిత్రం చేసే సమయానికి నటన నాకు కొత్త. అంత బరువైన పాత్ర పోషించడానికి చాలా కష్టపడ్డా. ఆ సినిమాతోనే నటనపై పూర్తి అవగాహన పెంచుకున్నా. అందుకే ఆ చిత్రం తర్వాత నేను చేసిన పాత్రలన్నీ కేక్‌వాక్‌ లాగే ఉండేవి. చాలా రోజుల తర్వాత హ్యాపీ పాత్ర నాకు కొత్తగా అనిపించింది.

ఈ పదేళ్ల కెరీర్‌లో టాప్‌ లీగ్‌లోకి చేరుకోలేకపోయానన్న భావన ఎప్పుడైనా కలిగిందా?  

పదేళ్లుగా చిత్రసీమలో ఉండటమే గొప్ప ఆనందం. అందరూ నంబర్‌ వన్‌కు వెళ్లలేరుగా. నా పనిని ఎంజాయ్‌ చేస్తున్నా. మనసుకు నచ్చిన పాత్రలే చేస్తున్నా. ఎలాంటి ఒత్తిడి తీసుకోవడం లేదు. ఫలానా పాత్రలు చేయాలని లక్ష్యాలేమీ లేవు.

కొత్త చిత్ర విశేషాలేంటి?

తమిళంలో అధర్వతో ఓ సినిమా చేస్తున్నా. చిత్రీకరణ పూర్తయింది. ‘పులి మేక’ అనే వెబ్‌సిరీస్‌ చేస్తున్నా. కొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని