Tiger 3: కత్రినా.. సప్త సొగసులు

అదిరే అందంతో, అద్భుతమైన అభినయంతో అభిమానులను ఆకట్టుకునే కథానాయికల్లో కత్రినా కైఫ్‌ ఎప్పుడూ ముందే ఉంటుంది.

Updated : 22 Oct 2023 13:50 IST

దిరే అందంతో, అద్భుతమైన అభినయంతో అభిమానులను ఆకట్టుకునే కథానాయికల్లో కత్రినా కైఫ్‌ ఎప్పుడూ ముందే ఉంటుంది. బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టైగర్‌ 3’లో ఆమె జోయా అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొడుతూనే, మరోపైపు తన స్టెప్పులతో ఆకర్షిస్తోంది. ఈ నెల 23న ఈ చిత్రం నుంచి ‘లేకే ప్రభు కా నామ్‌’ అనే పాట రానుంది. తాజాగా విడుదలైన ఆ పాట టీజర్‌ ఆకట్టుకుంటోంది. అందులో కత్రినా ఏడు కొత్త లుక్స్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ‘నా ఫేవరేట్‌ సాంగ్స్‌లో ఇదొకటి. ‘మాషాల్లా’, ‘స్వాగ్‌ సే స్వాగత్‌’ పాటల తర్వాత నాకిష్టమైన నృత్య దర్శకురాలు వైభవి మర్చంట్‌తో కలిసి పనిచేయటం ఎంతో ఆనందంగా ఉంది. ఆ పాటలో అనితా ష్రాఫ్‌ అజానియా నన్ను ఏడు లుక్స్‌లో అందంగా చూపించారు. టైగర్‌ ఫ్రాంచైజీ నుంచి వచ్చే పాటలో ఏదో ఒకటి చార్ట్‌ బస్టర్‌గా నిలుస్తుంది. అదే కోవలో ‘లేకే ప్రభు కా నామ్‌’ను కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. సల్మాన్‌ఖాన్‌తో కలిసి డ్యాన్స్‌ చేయడం ఎప్పుడూ ఎంజాయ్‌ చేస్తాను’ అని అంది కత్రినా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని