Tiger 3: తొలి పాటకు టైగర్‌ సిద్ధం

దీపావళి సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతోంది ‘టైగర్‌ 3’. బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తున్నారు.

Updated : 20 Oct 2023 12:27 IST

దీపావళి సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతోంది ‘టైగర్‌ 3’. బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తున్నారు. మనీష్‌ శర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్స్‌, ట్రైలర్‌తో చిత్రపరిశ్రమలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సినీప్రియులకు మరో తీపి కబురు వినిపించింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాలో మొదటి పాటను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ఇన్‌స్టా వేదికగా తెలుపుతూ.. ఓ ఫొటోను పంచుకున్నారు సల్మాన్‌. ‘ఈ సినిమాలోని అర్జిత్‌ సింగ్‌ పాడిన ‘లేకే ప్రభు కా నామ్‌’ అనే గీతాన్ని దసరా సందర్భంగా మీ ముందుకు తీసుకురాబోతున్నామ’ని వ్యాఖ్యల్ని జోడించారు. నవంబరు 12న ఈ సినిమా విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని