Liger: షారుఖ్‌ సూపర్‌హిట్‌ని గుర్తు చేసిన ‘లైగర్‌’ జోడీ..!

పక్కా మాస్‌, కమర్షియర్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ‘లైగర్‌’ (Liger) ప్రమోషన్స్‌లో బిజీ, బిజీగా పాల్గొంటున్నారు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), అనన్యా పాండే (Ananya Pandey). తమ చిత్రాన్ని ప్రమోట్‌ చేయడం కోస...

Published : 14 Aug 2022 02:53 IST

జంట అదిరిందంటూ నెటజన్లు క్యాప్షన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పక్కా మాస్‌, కమర్షియర్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ‘లైగర్‌’ (Liger) ప్రమోషన్స్‌లో బిజీ, బిజీగా పాల్గొంటున్నారు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), అనన్యా పాండే (Ananya Pandey). తమ చిత్రాన్ని ప్రమోట్‌ చేయడం కోసం ఈ జోడీ గత కొన్నిరోజుల నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు కలియదిరుగుతున్నారు. తాజాగా ఈ జోడీ  బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌ (Sharukh Khan) నటించిన ఓ సూపర్‌ హిట్‌ చిత్రాన్ని గుర్తు చేస్తోంది. ఈ జోడీని చూసిన నెటిజన్లు క్యూట్‌ పెయిర్‌ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ విజయ్‌ - అనన్య ఏం చేశారంటే?

‘లైగర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఈ చిత్రబృందం పంజాబ్‌లో పర్యటించింది. చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ సినిమా నుంచి ‘కోకా కోకా’ సాంగ్‌ని విడుదల చేసింది. ఇక, విజయ్‌ - అనన్య సంప్రదాయ దుస్తులు ధరించి ఈ ఈవెంట్‌లో పాల్గొని అందర్నీ ఆకర్షించారు. అయితే ఈవెంట్‌కు ముందు వీరిద్దరూ చుట్టపక్కల ప్రాంతాల్లోని పొలాల్లోకి వెళ్లి ఫొటోలకు పోజులిచ్చారు. కొన్ని ఫొటోల్లో విజయ్‌.. అనన్యను ఎత్తుకోగా.. మరికొన్ని చోట్ల వీరిద్దరూ కలిసి ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్నట్లు దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ పంజాబ్‌ తనకెంతో నచ్చిందని అన్నారు. ఈ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్‌ కావడంతో వీటిని చూసిన నెటిజన్లు.. ‘మీ ఫొటోలు చూస్తుంటే షారుఖ్‌ నటించిన ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’ గుర్తుకువస్తోంది’, ‘క్యూట్‌ పెయిర్‌’ అని కామెంట్స్ చేస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈసినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని