Liger: మైక్‌ టైసన్‌ బర్త్‌డే.. లైగర్‌ స్పెషల్‌ వీడియో

విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda), పూరీ జగన్నాథ్‌(Puri Jagannadh) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్‌’ (Liger). ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌(Mike Tyson) ఇందులో కీలకపాత్ర పోషించారు....

Published : 30 Jun 2022 12:33 IST

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘లైగర్‌’ (Liger). ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ (Mike Tyson) ఇందులో కీలకపాత్ర పోషించారు. గురువారం మైక్‌ టైసన్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘లైగర్‌’ టీమ్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపింది. విజయ్‌ దేవరకొండ, అనన్యా పాండే, పూరీ, ఛార్మి, కరణ్‌ జోహార్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. మైక్‌ టైసన్‌ ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని వారు కోరుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ‘లైగర్‌’ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో మొదటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘లైగర్‌’. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే కథతో ఇది సిద్ధమవుతోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో విజయ్‌ బాక్సర్‌గా విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా అనన్యాపాండే సందడి చేయనున్నారు. పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో నిమగ్నమైంది. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని