Oscars 2021: విజేతలు వీరే

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకునే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా వైరస్‌ కారణంగా గతేడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడిన....

Updated : 26 Apr 2021 12:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకొనే ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా వైరస్‌ కారణంగా గతేడాది నుంచి ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ వేడుక ఎట్టకేలకు నేడు కన్నుల పండువగా జరుగుతోంది. కొవిడ్‌ కారణంగా మొట్టమొదటిసారి ఈ వేడుకను రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు 93వ అకాడమీ అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంతోమంది దర్శకులు, నటీనటులు పోటీ పడుతున్నారు. ‘నోమడ్‌ ల్యాండ్‌’ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకురాలిగా క్లోవీ చావ్‌ను ఆస్కార్‌ వరించింది. దీంతో పాటు ఉత్తమ సంగీతం, ఉత్తమ సహాయ నటుడు అవార్డులను కూడా ప్రకటించారు. మిగతా విభాగాల్లో విజేతలను ప్రకటించాల్సి ఉంది.


విజేతలు వీరే

ఉత్తమ దర్శకురాలిగా అవార్డు గెలుపొందిన క్లోవీ చావ్‌

ఉత్తమ చిత్రం: నోమడ్‌ ల్యాండ్‌

ఉత్తమ నటి: ఫ్రాన్సెస్‌ మెక్‌డోర్మెండ్‌ (నోమడ్‌ ల్యాండ్‌)

ఉత్తమ నటుడు: ఆంథోని హాప్కిన్స్‌(ది ఫాదర్‌)

ఉత్తమ దర్శకురాలు: క్లోవీ చావ్‌ (నోమడ్‌ ల్యాండ్‌)

ఉత్తమ సహాయ నటుడు: డానియెల్‌ కలువోయా (జుడాస్‌ అండ్‌ ది బ్లాక్ మిస్సయా)

ఉత్తమ సహాయ నటి: యున్‌ యా జంగ్‌ (మినారి)

ఉత్తమ సౌండ్‌: సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌

ఉత్తమ సినిమాటోగ్రఫి: ఎరిక్‌ (మ్యాంక్‌)

(ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్‌ అందుకున్న యున్‌ యా జంగ్‌)

ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే: ఎమరాల్డ్‌ ఫెన్నెల్ (ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌)

ఉత్తమ అడాప్టెడ్‌ స్ర్కీన్‌ప్లే: క్రిస్టోఫర్‌ హామ్టన్‌, ఫ్లొరియన్‌ జెల్లర్‌ (ది ఫాదర్‌)

ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: అనదర్‌ రౌండ్‌ (డెన్మార్క్‌)

ఉత్తమ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌: సెర్హియోలోఫెజ్‌, మియానీల్‌, జమికా విల్సన్‌ (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్‌)

ఉత్తమ క్యాస్టూమ్‌ డిజైన్‌: అన్‌రాత్‌ (మా రైనీస్‌ బ్లాక్‌ బాటమ్)

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: మార్టిన్‌ డెస్మండ్‌ రాయ్‌ (టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్)

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: మైకల్‌ గ్రోవియర్‌ (ఇఫ్‌ ఎనిథింగ్‌ హ్యాపెన్స్‌ ఐ లవ్‌ యూ)

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పీట్‌ డాక్టర్‌, దానా మరీ (సోల్‌)

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌: అంథోనీ (కలెక్టివ్‌)

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌: పిపా, జేమ్స్‌ రీడ్‌, క్రేగ్‌ ఫాస్టర్‌ (మై ఆక్టోపస్‌ టీచర్‌)

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: ఆండ్రూ జాక్సన్‌, డేవిడ్‌ లీ (టెనెట్‌)

ఉత్తమ ప్రొడెక్షన్‌ డిజైన్‌: డోనాల్డ్‌ బర్ట్‌ (మ్యాంక్‌)

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌: ట్రెంట్‌ రెజ్నర్‌ (సోల్‌)

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: ఫైట్‌ ఫర్‌ యూ (జుడాస్‌ అండ్‌ బ్లాక్‌ మెస్సయ్య)

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని