వావ్‌! ఈమె డ్యాన్స్‌ అద్భుతం: మాధురీ దీక్షిత్‌

ప్రస్తుతమున్న సోషల్‌ మీడియా ప్రభంజనంలో ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా నటి మాధురీ దీక్షిత్‌ ఒక పల్లెటూరి యువతి నృత్యం చేస్తున్న వీడియోను  ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ పోస్టుకు ‘వావ్‌! ఆమె అద్భుతంగా డ్యాన్స్‌

Published : 09 Feb 2021 02:01 IST

న్యూదిల్లీ: ప్రస్తుతమున్న సోషల్‌ మీడియా ప్రభంజనంతో ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా నటి మాధురీ దీక్షిత్‌ ఒక పల్లెటూరి యువతి నృత్యం చేస్తున్న వీడియోను  ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఆ పోస్టుకు ‘వావ్‌! ఆమె అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తోంది. ఇలాంటి ప్రతిభను ఇంకా మనం వెలికి తీయాల్సిఉంది’ అంటూ రాసుకొచ్చారు.  1957లో వచ్చిన హిట్‌ చిత్రం ‘మదర్‌ ఇండియా’లోని గోగత్‌ నహీన్‌..అనే పాటకు ఆ యువతి అద్భుతంగా నృత్యం చేసింది. సుమారు 2 నిమిషాలకు పైగా ఉన్న ఆ వీడియోలో ఆమె ఎక్కడా తడబడకుండా నాటి హీరోయిన్లవలె చక్కనైన ముఖకవళికలతో అలరించింది. ఆ యువతి వివరాలు తెలియరాలేదు కానీ,  వీడియోను మొదట ‘రాగిరీ’ అనే ఒక ఎన్జీవో షేర్‌ చేసింది. నాటి తారలు మాధురీ దీక్షిత్‌, హేమమాలినీలను ఆ ట్వీట్‌కు  ట్యాగ్‌ చేస్తూ యువతి నృత్యంపై వారి అభిప్రాయాలు తెలపాల్సిందిగా కోరారు. ‘రాగిరీ’ సంస్థవారు సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని ప్రమోట్‌ చేస్తూ ఉంటారు. మరి ఆకట్టుకుంటున్న ఆ యువతి నృత్యాన్ని మీరూ చూసేయండి!

ఇవీ చదవండి!

ప్రకృతి కోపానికి నిదర్శనమిది

అనసూయ @ అర డజను చిత్రాలు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని