mahasamudram: ‘మహాసముద్రం’ తెలుగు సినిమా గర్వపడే చిత్రం.. శర్వానంద్
శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ దసరా కానుకగా ఈనెల 14న విడుదల కానుంది. ‘ఆర్ఎక్స్ 100’ విజయం తర్వాత అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు.
హైదరాబాద్: శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ దసరా కానుకగా ఈనెల 14న విడుదల కానుంది. ‘ఆర్ఎక్స్ 100’ విజయం తర్వాత అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. జగపతిబాబు, రావురమేశ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మహాసముద్రం ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో కార్తికేయ, దర్శకులు మెహర్ రమేశ్, వీరుపొట్ల హాజరయ్యారు.
సిద్దార్థ్ మాట్లాడుతూ...‘ తెలుగు ప్రేక్షకులకు నాకు గ్యాప్ వచ్చిందని చాలా మంది అంటున్నారు. నన్ను స్టార్‌ని చేసింది తెలుగు ప్రేక్షకులే. నేను ఎక్కడికి వెళ్లట్లేదు. నేను మీ సిద్ధుని. జెమిని కిరణ్ వల్లే నేను ఈ సినిమాలో భాగమయ్యాను. సినిమా ట్రైలర్ చూసి ఇతర పరిశ్రమల నుంచి ఫోన్లొచ్చాయి. ప్రతి ఒక్కరికి పేరుపేరున అందరికీ థాంక్స్. సినిమాలో పనిచేసిన అందరికీ ‘మహాసముద్రం’ మైలురాయిగా మిగిలిపోతుందనే నమ్మకముంది. మహాసముద్రం నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో తెలియదు. కానీ, నాకు ‘మహాసముద్రం’ ద్వారా శర్వానంద్ దొరికాడు. ఇది ఎవరి సినిమా అని అడుగుతున్నారు. ఇది కచ్చితంగా శర్వానంద్ సినిమానే. ఇది నా కమ్‌బ్యాక్ సినిమా కాదు. రీలాంఛ్ లాంటిది. నా ఇండస్ట్రీకి మళ్లీ నన్ను తీసుకొచ్చినందుకు అజయ్ భూపతికి కృతజ్ఞతలు’ అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ..‘ ఇది నా ఒక్కడి ‘మహాసముద్రం’ అంటే ఒప్పుకోను. ఈ సినిమాకు కథే హీరో. తెలుగు సినిమా అని గర్వపడే సినిమా అవుద్ది. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు అజయ్ భూపతికి ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ మనం సినిమాలు చేయాలి’ అన్నారు.
దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ..‘ ‘మహా సముద్రం’ ప్రయాణం నా జీవితంలో మరిచిపోలేనిది. ఇది భావోద్వేగాల ప్రేమకథ. విభిన్న పాత్రలుంటాయి. యాక్షన్ అదే స్థాయిలో ఉంటుంది. సినిమాలో అన్నిరకాల భావోద్వేగాలుంటాయి. ఇద్దరి హీరోలతో సినిమా ఎలా చేస్తావో అని చాలా మంది సందేహపడ్డారు. అఖరికీ ఆర్జీవీ కూడా శర్వానంద్, సిద్దార్థ్‌లను ఎలా హాండిల్ చేస్తావో చూస్తానన్నారు. నిజానికి హీరోలిద్దరూ అన్నిరకాలుగా సహకరించారు. సినిమాలో ప్రతి క్యారెక్టర్ అదిరిపోద్ది. ఈ సినిమా కథ భిన్నమైంది. నా మీద నమ్మకముంచిన నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసి భావోద్వేగాలు నిండిన కళ్లతో బయటకొస్తారు’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి.