JIFF: ‘జైపుర్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో సత్తా చాటిన తెలుగు చిత్రాలు.. ఉత్తమ నటిగా పాయల్‌

‘జైపుర్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో పాయల్‌ రాజ్‌పుత్‌ ఉత్తమ నటిగా నిలిచింది. ‘మంగళవారం’ సినిమాలోని నటనకుగాను ఆ అవార్డు దక్కింది.

Published : 30 Jan 2024 02:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 16వ ‘జైపుర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ (జె.ఐ.ఎఫ్‌.ఎఫ్‌) పురస్కారాల్లో (Jaipur International Film Festival) తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ‘మంగళవారం’ (Mangalavaram) నాలుగు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకోగా ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari), ‘బింబిసార’ (Bimbisara) పలు అవార్డులకు ఎంపికయ్యాయి. ‘మంగళవారం’లోని నటనకు గాను పాయల్‌ ఉత్తమ నటి అవార్డు, ‘భగవంత్‌ కేసరి’లోని నటనకు గాను కాజల్‌ అగర్వాల్‌ ‘ఆనర్‌ ఆఫ్‌ ది సినిమా అవార్డు’ అందుకోనున్నారు. ‘మంగళవారం’ చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి (Ajay Bhupathi) సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తంచేస్తూ తన టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తమ నటుడు రణ్‌బీర్‌.. ఉత్తమ చిత్రం 12th ఫెయిల్‌

82 దేశాల నుంచి 2,971 చిత్రాలు ఈ ఏడాది అవార్డులకు పోటీపడగా 67 దేశాలకు చెందిన 326 సినిమాలు నామినేట్‌ అయ్యాయి. తుది జాబితా ఇటీవల విడుదలైంది. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు జైపుర్‌ వేదికగా జరగనున్న వేడుకలో విజేతలకు అవార్డులు అందజేస్తారు. విజేతల వివరాలివీ..

ఆనర్‌ ఆఫ్‌ ది సినిమా అవార్డు

  • ప్రకాశ్‌ రాజ్‌: బింబిసార
  • అనుపమ్‌ ఖేర్‌: కార్తికేయ-2
  • అర్జున్‌ రాంపాల్‌: భగవంత్‌ కేసరి
  • కాజల్‌ అగర్వాల్‌: భగవంత్‌ కేసరి

‘మంగళవారం’ పురస్కారాలివీ..

  • ఉత్తమ నటి: పాయల్‌ రాజ్‌పుత్‌
  • బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: ఎం. ఆర్‌. రాజా కృష్ణన్‌
  • బెస్ట్‌ ఎడిటింగ్‌: గుళ్లపల్లి మాధవ్‌ కుమార్‌
  • బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌: ముదస్సర్‌ మహ్మద్‌

ఫీచర్‌ ఫిల్మ్‌: జె.ఐ.ఎఫ్‌.ఎఫ్‌. ఇండియన్‌ పనోరమ

  • గోల్డెన్‌ క్యామెల్‌ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ డైరెక్టర్‌: వశిష్ఠ (బింబిసార)
  • రెడ్‌ రోజ్‌ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ రిలీజ్‌డ్‌ ఫిల్మ్‌: బింబిసార
  • బెస్ట్‌ మేకప్‌, హెయిర్‌ స్టైలింగ్‌: బింబిసార
  • ఉత్తమ నటి: శ్రీలీల (భగవంత్‌ కేసరి)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని