మెగాస్టార్‌ ‘లూసిఫర్‌’ సందడి మొదలైంది

మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లూసిఫర్‌’ సందడి మొదలైంది. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధానపాత్రలో నటించనున్నారు. ‘ధృవ’ డైరెక్టర్‌ మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తొలిపూజ కార్యక్రమం ఫిలింనగర్ సూపర్‌గుడ్ సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగింది.

Updated : 20 Jan 2021 20:11 IST

హైదరాబాద్‌: మెగా అభిమానులు సిద్ధంగా ఉండండి.. మీరెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లూసిఫర్‌’ సందడి మొదలైంది. మలయాళంలో మంచి విజయం సాధించిన ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధానపాత్రలో నటించనున్నారు.  డైరెక్టర్‌ మోహన్‌రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తొలిపూజ కార్యక్రమం ఫిలింనగర్ సూపర్‌గుడ్ సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడారు.. ఈ సినిమాను తెలుగు అభిమానులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. మెగాస్టార్‌ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద విజయంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్‌వీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై ఆర్‌బీచౌదరి, ఎన్‌వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ పూజా కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, డైరెక్టర్‌ మోహన్‌రాజాతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినిదత్, డివివి దానయ్య, నిరంజన్‌రెడ్డి, సంగీత దర్శకుడు తమన్, మెగా బ్రదర్ నాగబాబు, కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమినీ కిరణ్, రచయిత సత్యానంద్, మెహర్ రమేశ్‌, బాబీ, రామ్ ఆచంట, గోపి ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నవీన్ యెర్నేని, శిరీష్ రెడ్డి, యూ వి క్రియేషన్స్ విక్కీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి..

ఆ మాట నేను అనలేదు: ఇళయరాజా


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని