Chiranjeevi: వింటేజ్‌ మాస్‌ లుక్‌లో మెగాస్టార్.. థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అంటోన్న ఫ్యాన్స్

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌.

Updated : 24 Oct 2022 11:54 IST

హైదరాబాద్‌: మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న దీపావళి స్పెషల్‌ ధమాకా వచ్చేసింది. పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న 154వ ప్రాజెక్ట్‌ నుంచి సర్‌ప్రైజ్‌ విడుదలైంది. బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా టైటిల్‌ టీజర్‌, చిరు ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం సోమవారం ఉదయం విడుదల చేసింది. ముందు నుంచి చెప్పినట్లుగానే ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) అనే టైటిల్‌ ఖరారు చేశారు.

ఇక, మెగాస్టార్‌ లుక్‌ విషయానికి వస్తే.. లుంగీ కట్టుకుని, ఉంగరాలు, కడియం, చెవి పోగుతో ఊరమాస్‌ గెటప్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటిని షేక్‌ చేస్తోంది. దీనిని చూసిన నెటిజన్లు.. చిరంజీవి నటించిన ఒకప్పటి మాస్‌ చిత్రాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు. విభిన్నమైన మాస్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్‌ కనిపించనున్నారు. రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. సంక్రాంతి కానుకగా ఈసినిమా విడుదల కానుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు