Chiranjeevi Sarja: డియర్‌ చిరు.. నీకోసమే నవ్వుతున్నా: మేఘనా రాజ్‌

ఆదివారం కన్నడ నటుడు చిరంజీవి సర్జా జయంతి. ఈ సందర్భంగా ఆయన సతీమణి మేఘనా రాజ్‌.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. 

Published : 17 Oct 2022 12:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన భర్త, కన్నడ నటుడు చిరంజీవి సర్జా (Chiranjeevi Sarja) జయంతి సందర్భంగా నటి మేఘనా రాజ్‌ (Meghana Raj) ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. పెళ్లి నాటి ఫొటోను షేర్‌ చేసిన ఆమె.. ‘‘నా సంతోషానికి పుట్టినరోజు శుభాకాంక్షలు!! డియర్‌ చిరు.. నీకోసమే నేనింకా నవ్వుతూ జీవిస్తున్నా. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. ‘‘మేడమ్‌ మీరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం’’, ‘‘మేమే ఆయన్ని మర్చిపోలేకపోతున్నాం. అలాంటిది మీరెంత బాధపడుతున్నారో తెలుస్తోంది’’ అని కామెంట్స్‌ పెడుతున్నారు. కన్నడ పరిశ్రమలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి సర్జా.. 2020 జూన్‌లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని