RGV: చిరు, నాగార్జున వ్యాఖ్యలపై స్పందించను..: రామ్‌గోపాల్‌ వర్మ

ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సినిమా టికెట్‌ ధరల వ్యవహారంపై వీరిద్దరూ...

Updated : 10 Jan 2022 14:33 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సినిమా టికెట్‌ ధరల వ్యవహారంపై వీరిద్దరూ చర్చిస్తున్నారు. సినిమా టికెట్‌ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆర్జీవీ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఇటీవల ఏపీ ప్రభుత్వం, మంత్రి పేర్ని నానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘సినిమా టికెట్‌ ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదు’ అని ఆర్జీవీ కామెంట్‌ చేశారు. దీంతో నానీ-ఆర్జీవీల మధ్య కొన్ని రోజులపాటు ట్వీట్‌ వార్‌ జరిగింది. సమస్యను పరిష్కరించే విధంగా చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని వర్మ కోరడంతో మంత్రి పేర్ని నాని అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. దీంతో ఆయన నేడు మంత్రిని కలిశారు. 

పేర్ని నానితో భేటీకి ముందుకు ఆర్జీవీ మీడియాతో మాట్లాడారు. సినీ దర్శకుడిగానే కలుద్దామని వచ్చానని, పరిశ్రమ తరపున రాలేదని చెప్పారు. టికెట్ల అంశంలో చిరంజీవి, నాగార్జున చేసిన వ్యాఖ్యలపై స్పందించనని.. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిదన్నారు. ఈ అంశంలో ఫిల్మ్‌ మేకర్‌గా తన అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని