Mukhachitram review: రివ్యూ: ముఖచిత్రం
Mukhachitram review: విశ్వక్సేన్, వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్యరావ్ కీలక పాత్రల్లో నటించిన ‘ముఖచిత్రం’ ఎలా ఉందంటే?
Mukhachitram review; చిత్రం: ముఖచిత్రం; నటీనటులు: వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్, విష్వక్సేన్ (ఓ కీలకపాత్రలో), రవిశంకర్ తదితరులు; సంగీతం: కాల భైరవ; కూర్పు: పవన్ కళ్యాణ్; సమర్పణ: ఎస్ కే ఎన్; నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల; కథ స్క్రీన్ ప్లే, మాటలు - సందీప్ రాజ్; దర్శకత్వం - గంగాధర్; సంస్థ: పాకెట్ మనీ పిక్చర్స్; విడుదల: 09 -12-2022
ఈవారం పదుల సంఖ్యలో సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. చూడాలనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించిన సినిమాలు ఇందులో కొన్నే. ‘ముఖచిత్రం’ ప్రచార చిత్రాలు ఆకర్షించాయి. ‘కలర్‌ఫొటో’ తీసిన దర్శకుడు సందీప్ రాజ్ రచన చేయడం, కథానాయకుడు విష్వక్సేన్ ఇందులో భాగం కావడం తదితర విషయాలు సినిమాపై కాస్త అంచనాల్ని పెంచాయి. (Mukhachitram review) మరి అందుకు తగ్గట్టుగా సినిమా ఉందో లేదో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం...
కథేంటంటే: మహతిని (ప్రియ వడ్లమాని)ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు రాజ్ కుమార్ (వికాస్ వశిష్ట). అతనొక ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్. మరోపక్క అతన్ని మాయా ఫెర్నాండెజ్ (అయేషా ఖాన్) అనే యువతి చిన్నప్పట్నుంచీ ప్రేమిస్తుంటుంది. తన ప్రియుడికి పెళ్లి కావడంతో నిరాశ చెందుతుంది. అంతా సవ్యంగా సాగుతున్న దశలో రాజ్ జీవితంలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవి రాజ్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అతని జీవితంలో డాక్టర్ సత్య (చైతన్య రావు) ఎలా భాగమయ్యాడన్నది తెరపై చూసి తెలుసుకోవల్సిందే.
ఎలా ఉందంటే: ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించిన చిత్రమిది. ఇలాంటి సామాజిక పరమైన అంశాల్ని సినిమాతో స్పృశించడం మంచి పరిణామం. ఆ విషయంలో చిత్రబృందాన్ని మెచ్చుకోవాల్సిందే. కానీ, దాన్ని డీల్ చేసిన విధానంలోనే లోటుపాట్లు కనిపిస్తాయి. సామాజికాంశాన్ని ప్రేక్షకుడికి నచ్చే వినోదంతో మేళవించిన తీరు అతకలేదు. ప్రథమార్ధం మొత్తం పాత్రల పరిచయంతోనే గడిచిపోతుంది. చెప్పాలనుకున్నదంతా ద్వితీయార్ధంలో చెప్పడం కోసం ప్రయత్నించారు. కొన్ని మలుపులు ఆకట్టుకున్నా, ఆ తర్వాత మళ్లీ సినిమా గాడి తప్పింది. కోర్ట్ రూమ్ డ్రామా సినిమాకి కీలకం. కానీ అది కూడా సినిమాపై పెద్దగా ప్రభావం చూపించదు. నిజానికి ఈ కథలో మంచి సందేశం, థ్రిల్లర్ అంశాలు, కోర్ట్ రూమ్ డ్రామా వంటి బలమైన ముడిసరకు ఉన్నాయి. కానీ, వాటిని సరైన సమయంలో సరైన రీతిలో వాడుకోవడమే కుదరలేదు. దాంతో దేనికదే ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రేక్షకుడు ఎక్కడా కథలో లీనం కాలేని పరిస్థితి. ద్వితీయార్ధం ఆరంభ సన్నివేశాలు ఆసక్తికరంగా సాగినా, ఆ తర్వాత మళ్లీ ఆ జోరు కనిపించదు. సినిమా పూర్తయ్యాక ఓ బలమైన కథాంశం వృథా అయినట్టు అనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే: ప్రియా వడ్లమాని నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆమె రెండు కోణాల్లో సాగే పాత్రలో మంచి అభినయం ప్రదర్శించింది. వికాస్ వశిష్ఠ , ఆయేషాఖాన్, చైతన్యరావు కూడా ఆకట్టుకుంటారు. విష్వక్సేన్ ఓ కీలక పాత్రలో మెరుస్తారు. కోర్ట్ రూమ్ డ్రామాలో ఆయన, రవిశంకర్ ల నటన మెప్పిస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కాలభైరవ సంగీతం ఆకట్టుకుంటుంది. కెమెరా పనితనం మెచ్చుకోతగ్గ స్థాయిలో ఉంది. సందీప్‌రాజ్ కథ, మాటలు బాగున్నాయి. కథనం పరంగా ఆయన చేసిన కసరత్తులు చాలలేదు. దర్శకుడు గంగాధర్ కొన్ని సన్నివేశాలపై మాత్రమే ప్రభావం చూపించారు. నిర్మాణం బాగుంది.
బలాలు: 👍 కథా నేపథ్యం, 👍 ప్రియా వడ్లమాని నటన, 👍 ద్వితీయార్ధంలో మలుపులు
బలహీనతలు: 👎 ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు, 👎 ఆసక్తిని రేకెత్తించని కథనం 👎 పతాక సన్నివేశాలు
చివరిగా: ముఖచిత్రం: కాన్సెప్ట్ బాగుంది కానీ..
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా?
తాజా వార్తలు (Latest News)
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్‌కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే