Pooja Hegde: నెరవేరిన కల

కథానాయికగా కెరీర్‌ ఆరంభంలోనే వైవిధ్యభరిత కథల్లో నటించే  అవకాశాలు అందుకొంది పూజా హెగ్డే. అయితే ఇప్పటి వరకు ఎన్ని చిత్రాలు చేసినా.. ప్రభాస్‌తో కలిసి చేసిన ‘రాధేశ్యామ్‌’ తనకెంతో ప్రత్యేకమని చెబుతోంది ఈ బుట్టబొమ్మ. సంక్రాంతి

Updated : 08 Jan 2022 07:28 IST

థానాయికగా కెరీర్‌ ఆరంభంలోనే వైవిధ్యభరిత కథల్లో నటించే  అవకాశాలు అందుకొంది పూజా హెగ్డే. అయితే ఇప్పటి వరకు ఎన్ని చిత్రాలు చేసినా.. ప్రభాస్‌తో కలిసి చేసిన ‘రాధేశ్యామ్‌’ తనకెంతో ప్రత్యేకమని చెబుతోంది ఈ బుట్టబొమ్మ. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కావాల్సిన ఈ పాన్‌ ఇండియా చిత్రం.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ  నేపథ్యంలోనే ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ‘రాధేశ్యామ్‌’కి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకుంది పూజా.  ‘‘ఓ వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంలో నటించాలని నేనెప్పటి నుంచో కలలు కంటున్నా. ‘రాధేశ్యామ్‌’తో నా కల నెరవేరింది. నేనిప్పటి వరకు చేసిన చిత్రాల్లో నాకెంతో క్లిష్టమైనది.. ప్రత్యేకమైనది ఈ సినిమానే. దీంట్లో నాయిక పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఇదొక పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రం కావడంతో.. ప్రేరణ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్‌ చేయాల్సి వచ్చింది. ఏదేమైనా ఈ ప్రయాణం నాకెంతో ప్రత్యేకమైనది’’ అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఈ లవ్‌ మేజిక్‌ను వెండితెరపై చూసేందుకు అందరిలాగే తానూ ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని