RRR: ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ సాంగ్‌ జీ5లో లైవ్‌ స్ట్రీమింగ్! (ప్రకటన)

చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ (Oscars) అవార్డుల ప్రదానోత్సవం కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఆస్కార్‌ వేదికపై తెలుగు గాయకులు రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ‘నాటు నాటు’ పాటను ఆలపించనున్నారు.

Updated : 12 Mar 2023 18:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ వేడుకులకు గడువు  సమీపిస్తున్నకొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా  ప్రజాదరణ పొందిన ‘RRR’ సినిమా నుంచి పాపులర్‌ సాంగ్‌ ‘నాటు నాటు’ను ప్రదర్శించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనను ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ పాటను కోట్లాది మంది అభిమానులు వీక్షిస్తూనే ఉన్నారు. 2022లో జీ5 ఓటీటీలో విడుదలైన పది రోజుల్లోనే ఈ చిత్రం 1000 మిలియన్‌ స్ట్రీమింగ్‌ నిమిషాలను సంపాదించింది. భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది.  ప్రపంచంలోని ఏ దేశంవారైనా ఈ సినిమాను జీ5 ఓటీటీలో ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో  చూడొచ్చు.

గతేడాది కాలంలో సినిమా సాధనంగా వినోద రంగం అద్భుతమైన పురోగతిని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా నటులు, సినిమాలు కళారంగానికి చేసిన కృషి వల్ల విశేషమైన గుర్తింపును పొందారు. వేర్వేరు ప్రాంతాల్లో సంస్కృతుల గురించి ప్రేక్షకులకు అవగాహన ఏర్పడుతుండటంతో స్వీయ అనుభవం ద్వారా వాటి గురించి తెలుసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో ప్రపంపవ్యాప్తంగా వివిధ జీవనవైవిధ్యానాలను ప్రతిబింబించే కథలు, కంటెంట్‌ కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

95వ ఆస్కార్‌ అవార్డులకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నామినేట్ కావడం ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనం. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా లభించిన ఆదరణ, ప్రశంసలు దక్షిణాసియా వినోద రంగం గురించి చర్చించుకునేలా చేసింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందన కేవలం తెలుగు సినీ పరిశ్రమకే కాకుండా.. యావత్‌ భారతీయ  చిత్ర పరిశ్రమకే కొత్త రూపును ఇవ్వడంతో పాటు మన సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును గెలుకుని సంబరాలను తీసుకొస్తే..  మార్చి 12న జరిగే అకాడమీ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై ప్రదర్శించడం ద్వారా సినీ ప్రియులను మరోసారి అలరించనుంది. నాటు నాటు పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ కలిసి అకాడమీ అవార్డుల వేదికపై ఆలపించడం దక్షిణాసియా వినోద రంగానికి చరిత్రాత్మక ఘట్టం.  అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ప్రదర్శించే రెండో భారతీయ పాట. తొలిసారి ఈ వేదికపై భారతీయ పాటను 2009లో అకాడమీ అవార్డ్‌ గ్రహీత, భారతీయ సంగీత దర్శకుడు ఏ ఆర్‌ రెహమాన్‌ ఆలపించారు. ఈసారి రిహన్న, సోఫియా కార్సన్, స్టెఫానీ హు, డయాన్ వారెన్, డేవిడ్ బ్రైన్, సన్ లక్స్ వంటి వారితో పాటు  రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ ఈ వేదికపై ప్రదర్శన ఇవ్వనున్నారు. నాటు నాటు పాటను ఎం.ఎం. కీరవాణి స్వరపరిచారు. అకాడమీ అవార్డుల వేదికపై ఈ పాటను ప్రదర్శించడం ద్వారా దక్షిణాసియా సినీ పరిశ్రమ రంగంలో మరో మైలురాయిగా నిలవనుంది.

RRR’ను తెలుగులో జీ5 గ్లోబల్‌ యాప్‌లో ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌తో వీక్షించండి. జీ5 యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌/ ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌తో పాటు రోకు డివైజెస్‌, యాపిల్‌ టీవీ, ఆండ్రాయిడ్‌, అమెజాన్‌ ఫైర్‌ స్టిక్‌, శాంసంగ్‌ స్మార్ట్‌ టీవీలో కూడా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. www.ZEE5.com వెబ్‌సైట్‌లో కూడా వీక్షించొచ్చు.

జీ5 గ్లోబల్‌ డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్ వేదికను జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ ప్రారంభించింది. 2018 అక్టోబరులో 190కిపైగా దేశాల్లో 18 భాషల్లో విడుదల చేశారు. హిందీ, ఆంగ్లం, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాత్‌, పంజాబీ వంటి భారతీయ భాషలతోపాటు మలాయ్‌, థాయ్‌, బహసా, ఉర్దూ, బంగ్లా, అరబిక్‌ వంటి ఇతర దేశ భాషల్లోనూ సేవలిందిస్తోంది. జీ5 గ్లోబల్‌లో రెండు లక్షల గంటలకుపైగా కంటెంట్‌ ఉంది. వీటిలో సినిమాలు, టీవీ షోలు, సంగీతం వంటి వాటితోపాటు హెల్త్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌ కంటెంట్ కూడా ఉంది.

జీ5 గ్లోబల్‌ ట్విటర్‌: https://twitter.com/ZEE5Global

జీ5 గ్లోబల్‌ లింక్డిన్‌: https://www.linkedin.com/company/zee5global/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు