Nacchindi Girl Friendu: ఓటీటీలోకి ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

ఉదయ్‌ శంకర్‌ నటించిన ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. ఏ ఓటీటీలో, ఎప్పుడు స్ట్రీమింగ్‌ అంటే?

Updated : 19 Jul 2023 20:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉదయ్‌ శంకర్‌ (Uday Shankar) కథానాయకుడిగా దర్శకుడు గురుపవన్‌ తెరకెక్కించిన చిత్రం ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’ (Nacchindi Girl Friendu). జెన్నీఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. మధునందన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా థియేటర్లలో గతేడాది నవంబరులో విడుదలై, యువతను మెప్పించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’ (Aha)లో ఈ సినిమా ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా సదరు సంస్థ ట్రైలర్‌ని విడుదల చేసింది. ‘ఫిబ్రవరి 13.. నా లైఫ్‌లో నేను మర్చిపోలేని రోజు’ అని హీరో తన గురించి చెప్పే సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయిన యువకుడు ఆ అమ్మాయిపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు? అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని