Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య

తన మాజీ సతీమణి, కథానాయిక సమంతను (Samantha) తాను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటానని నటుడు నాగచైతన్య (Naga Chaitanya) తెలిపారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూ...

Published : 07 Aug 2022 01:56 IST

మళ్లీ ప్రేమలో పడటానికి ఓకే అంటోన్న నటుడు 

హైదరాబాద్‌: తన మాజీ సతీమణి, కథానాయిక సమంతను (Samantha) తాను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటానని నటుడు నాగచైతన్య (Naga Chaitanya) తెలిపారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోన్న ఆయన తాజాగా మరోసారి సామ్‌తో విడాకులు తీసుకోవడంపై స్పందించారు. ‘‘పరస్పర అంగీకారంతోనే మేమిద్దరం విడిపోయాం. ఆ విషయాన్ని అందరితో చెప్పాలనుకున్నాం.. చెప్పాం. కాకపోతే.. కొంతమంది కావాలని ఏవేవో వార్తలు సృష్టిస్తున్నారు. విడిపోయి ఎవరి జీవితాలు వాళ్లు చూసుకుంటున్నాం. విడాకులు తీసుకున్నప్పటికీ మాకు ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది. సామ్‌ చేసే ప్రతి వర్క్‌ని చూస్తూనే ఉంటా. ఆమెను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా. విడిపోయిన నాటి నుంచి ఇప్పటివరకూ నేను నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. కానీ, అందరూ ఇంకా విడాకుల గురించే మాట్లాడుతున్నారు. ప్రతిచోటా ఈ విషయం గురించే ప్రశ్నలు అడుగుతున్నారు. దానివల్ల విసిగిపోతున్నా’’ అని నాగచైతన్య చెప్పుకొచ్చారు.

అనంతరం ‘‘మీరు మళ్లీ ప్రేమలో పడే అవకాశం ఉందా?’’ అని ప్రశ్నించగా.. ‘‘తప్పకుండా పడతాను. ఎవరికి తెలుసు భవిష్యత్తులో ఏం జరగనుందో. మనిషి జీవించడానికి ఊపిరి ఎంతో అవసరమో.. ప్రేమ కూడా అంతే అవసరం. మనం ప్రేమించాలి. ఎదుటివారి ప్రేమను సొంతం చేసుకోవాలి. అలా జరిగితేనే ఎప్పటికీ ఆరోగ్యంగా, పాజిటివ్‌గా ఉండగలుగుతాం’’ అని చైతన్య వివరించారు.

ఇక, సామ్‌ ఇటీవల ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొని తాను జీవితంలో ఇకపై ప్రేమలో పడాలనుకోవడం లేదని.. చైతన్యకు-తనకు మధ్య సఖ్యత లేదని చెప్పారు. అంతేకాకుండా, తామిద్దర్నీ.. ఒకే గదిలో పెడితే అక్కడ పదునైన వస్తువులేమీ లేకుండా చూసుకోవాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అంతటా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని