Naga chaitanya: సముద్రం మధ్యలో తండేల్‌

కొత్త గెటప్‌తోనే కాదు... సినిమాకి ముందు పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమై రంగంలోకి దిగారు నాగచైతన్య. ఇదంతా యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ‘తండేల్‌’ కోసమే.

Updated : 27 Dec 2023 09:28 IST

కొత్త గెటప్‌తోనే కాదు... సినిమాకి ముందు పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమై రంగంలోకి దిగారు నాగచైతన్య. ఇదంతా యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ‘తండేల్‌’ కోసమే. గీతా ఆర్ట్స్‌ పతాకంపై చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సాయిపల్లవి కథానాయిక. బన్నీ వాస్‌ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. కొన్నిరోజుల కిందటే ఉడిపిలో చిత్రీకరణ ప్రారంభమైంది. సుదీర్ఘమైన ఈ షెడ్యూల్‌లో భాగంగా కీలకమైన పోరాట ఘట్టాలతోపాటు... కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సముద్రం మధ్యలో సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఓ స్టిల్‌ని విడుదల చేశారు. ‘‘భిన్న నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. మునుపెన్నడూ చూడని ఓ కొత్త గెటప్‌లో నాగచైతన్య కనిపిస్తారు. ప్రత్యేకమైన శిక్షణతో రంగంలోకి దిగారాయన. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఛాయాగ్రహణం: షామ్‌దత్‌, కళ: శ్రీనాగేంద్ర తంగాల.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని