Naga Chaitanya: ఆ జ్ఞాపకాలు నేనెప్పటికీ గుర్తుచేసుకుంటా..: నాగ చైతన్య

తాను హీరోగా నటించిన ఓ సినిమా జ్ఞాపకాలను తాను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని నటుడు నాగ చైతన్య (Naga Chaitanya) పేర్కొన్నారు. ఆయన హీరోగా నటించిన...

Updated : 07 Dec 2022 20:44 IST

హైదరాబాద్‌: ‘లవ్‌స్టోరీ’ సినిమా జ్ఞాపకాలను తాను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని నటుడు నాగ చైతన్య (Naga Chaitanya) అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘లవ్‌ స్టోరీ’ (Love Story) విడుదలై శనివారానికి ఏడాది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ఈ సినిమా నాకెన్నో విషయాలు నేర్పించింది. నాకెప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో మధురానుభూతులను అందించింది’’ అని చై ట్వీట్‌ చేశారు.

కుల వ్యవస్థపై రూపుదిద్దుకున్న భావోద్వేగ చిత్రం ‘లవ్‌ స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించి అలరించారు. మధ్య తరగతి కుర్రాడిగా నాగచైతన్య నటన, సాయిపల్లవి డ్యాన్స్‌ ప్రతిఒక్కర్నీ ఆకట్టుకున్నాయి. అభిమానులకే కాక సినీ ప్రముఖులు సైతం సాయిపల్లవిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక, చై ప్రస్తుతం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని