Naga Shaurya: ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుందని ముందే చెప్పా: నాగశౌర్య

తాను కథానాయకుడిగా నటించిన ఓ సినిమాపై నాగశౌర్య (Naga Shaurya) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుందని తాను నిర్మాతతో ముందే చెప్పానని అన్నారు.

Published : 03 Jul 2023 18:45 IST

హైదరాబాద్‌: దర్శకుడు - నిర్మాత - నటుడు.. ఈ ముగ్గురూ ఒక మాటపై నిలబడి సినిమా చేస్తే అది తప్పకుండా విజయం అందుకుంటుందని హీరో నాగశౌర్య (Naga Shaurya) చెప్పారు. తన సినిమాలకు ఎంతోమంది సూచనలు, సలహాలు ఇస్తుంటారని, వాటిని పాటించడంతో నాణ్యత కొరవడి సినిమాలు పరాజయం అందుకున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

‘‘నేను హీరోగా నటించిన ఓ సినిమా ఘోర పరాజయం అందుకుంది. ఆ సినిమా కోసం ఎంతో శ్రమించా. శారీరకంగా లుక్‌లో మార్పులు చేసుకున్నా. కథ చెప్పినప్పుడు భారీ సెట్స్‌, ప్రముఖ నటీనటులతో ఈ సినిమా ఉంటుందని చెప్పారు. తీరా సెట్స్‌లోకి అడుగుపెట్టాక అక్కడి పరిస్థితులు వేరు. ‘‘ఇలా అయితే సినిమా ఆడదు. మీకు ఒకవేళ ఫ్లాప్‌ సినిమా చేయాలని ఉంటే తప్పకుండా చేద్దాం. కాకపోతే, ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డా. దీనిపై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నా అదొక్కటే బాధగా ఉంది’’ అని నిర్మాతకు చెప్పేశా. నేను నటించిన ఎన్నో సినిమాలకు వేరే వ్యక్తులు సలహాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సినిమా చిత్రీకరిస్తున్నప్పుడే ‘ఇది బాలేదు అది బాలేదు.. ఇలా మార్పులు చేస్తే సరిపోతుంది’ అని సూచనలు చేసేవారు. వారి మాటలు కాదనలేక.. నేను కూడా అన్నింటికీ ఓకే అనేవాడిని. అలా, వచ్చిన పలు సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడలేదు’’ అని శౌర్య తెలిపారు. అనంతరం ఆయన తన సినిమాల విషయంలో సలహాలు ఇచ్చేవారికి నో చెప్పడం నేర్చుకున్నానన్నారు.

ఇక, వర్క్‌ విషయానికి వస్తే.. నాగశౌర్య నటించిన సరికొత్త చిత్రం ‘రంగబలి’. పవన్‌ బాసంశెట్టి దర్శకుడు. యుక్తి తరేజ కథానాయిక. జులై 7న ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్య తన కెరీర్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్‌ బాసింశెట్టి కథ ఎలా అయితే చెప్పారో అదే విధంగా తెరకెక్కించారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు