Naga Vamsi: SSMB 28 రిజల్ట్‌పై నెటిజన్ జోస్యం.. నిర్మాత అసహనం
‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు (MaheshBabu) - త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన విషయం తెలిసిందే. నాగవంశీ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఫలితం ఎలా ఉండనుందో తెలియజేస్తూ ఓ నెటిజన్ జోస్యం చెప్పాడు.
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఫలితం గురించి జోస్యం చెప్పిన ఓ నెటిజన్‌పై చిత్ర నిర్మాత నాగవంశీ అసహనం వ్యక్తం చేశారు. రానున్న ప్రపంచ కప్ ఫలితం ఎలా ఉండనుందో అంచనా వేసి చెప్పమంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
‘‘మహేశ్ కెరీర్‌లో ‘బ్రహ్మోత్సవం’ ఓ పెద్ద ఫ్లాప్. దాని తర్వాత వచ్చిన ‘స్పైడర్’ మరో ఫ్లాప్. ఇలా వరుస పరాజయాలు ఇచ్చిన హీరో.. ఆ తర్వాత ఆరు సినిమాలతో హిట్ అందుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు..! 1. భరత్ అనే నేను, 2. మహర్షి, 3. సరిలేరు నీకెవ్వరు, 4. సర్కారు వారి పాట, 5. SSMB 28 (త్రివిక్రమ్-మహేశ్.. హిట్ మూవీ) 6.SSMB 29 (రాజమౌళి-మహేశ్.. ఇది పక్కా బ్లాక్‌బస్టర్)’’ అని పేర్కొంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
కాగా, తమ చిత్రాన్ని కేవలం హిట్ అని మాత్రమే పేర్కొనడంపై నిర్మాత నాగవంశీ అసహనం వ్యక్తం చేశారు. ‘‘అంటే.. నిర్మాణ దశలో ఉన్న చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో కూడా మీరే జోస్యం చెప్పేస్తారన్నమాట. #SSMB 28 ఒక డీసెంట్ మూవీ అవుతోందని మీరు డిసైడ్ చేసేశారు. నా తరఫు నుంచి ఓ చిన్న విన్నపం.. వీలుంటే రానున్న వరల్డ్ కప్ ఫలితాన్ని కూడా అంచనా వేసి చెప్పండి’’ అని వ్యంగ్యంగా కౌంటర్ విసిరారు. SSMB 29కి పక్కా బ్లాక్‌బస్టర్ అని చెప్పి.. తమ చిత్రాన్ని కేవలం హిట్ అని చెప్పడం వల్ల నాగవంశీ ఒకింత అసహనానికి గురయ్యారని.. ఇలా కామెంట్ చేశారని నెటిజన్లు అనుకుంటున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
బీసీసీఐ గ్రేడ్స్‌లో రాహుల్ కిందికి
-
India News
Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!
-
Sports News
IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
-
Movies News
SS Karthikeya: ‘RRR’ ఆస్కార్ క్యాంపెయిన్ ఖర్చు ఇదే.. విమర్శకులకు కార్తికేయ కౌంటర్!
-
Politics News
Madhyapradesh: 200కు పైగా సీట్లు గెలుస్తాం.. మళ్లీ అధికారం మాదే..: నడ్డా
-
India News
Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్!