Guntur Kaaram: ‘గుంటూరు కారం’.. మేము అనుకున్నదానికంటే ఎక్కువగా వసూళ్లు రాబట్టింది: నాగవంశీ

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తొలిరోజు కలెక్షన్స్‌పై చిత్ర నిర్మాత నాగవంశీ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న వారికి ధన్యవాదాలు చెప్పారు.

Updated : 13 Jan 2024 16:46 IST

హైదరాబాద్‌: ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)ను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ చిత్ర నిర్మాత నాగవంశీ (Naga Vamsi), నైజాం డిస్ట్రిబ్యూటర్‌ దిల్‌రాజు (Dil Raju) తాజాగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ బాగున్నాయన్నారు. ‘‘తొలిరోజు మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వసూళ్లు వచ్చాయి. పలుచోట్ల ప్రీమియర్‌ షోలు ప్రదర్శించగా మిక్స్‌డ్‌ రివ్యూలు వచ్చాయి. ఫస్ట్‌ షో సమయానికి పాజిటివ్‌గా మారాయి. పండగ పూట కుటుంబంతో కలిసి వీక్షించే చిత్రమిది. పాటలు, ఫైట్స్‌, కామెడీ... ఇలా అన్ని ఎలిమెంట్స్‌ ఉన్న పూర్తిస్థాయి పండగ సినిమా ఇది. దయచేసి మిగిలిన విషయాలేవీ నమ్మకుండా థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి. మీరు తప్పకుండా ఎంటర్‌టైన్‌ అవుతారనే గ్యారంటీ నాది’’ అని నాగవంశీ అన్నారు.

saindhav movie review: సైంధ‌వ్‌ రివ్యూ.. వెంకటేశ్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే!

దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘తల్లీకుమారుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన చిత్రమిది. తొలుత నెగెటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ.. కథ నచ్చి ప్రేక్షకులు సూపర్‌హిట్‌ చేసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. సంక్రాంతికి ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కలెక్షన్స్‌ ఆధారంగా చేసుకుని హిట్‌ లేదా ఫ్లాప్‌  అంచనా వేస్తారు. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. దాన్ని ఎవరూ ఆపలేరు. అది చరిత్ర. సంక్రాంతి వచ్చినప్పుడల్లా ఇలాంటి గొడవలు జరగడం సర్వసాధారణం. ఎందుకంటే ఇదొక బిజినెస్‌. ఇక్కడ ఎవరూ ఎవరికి శత్రువులు కాదు. అలాగే మిత్రులూ కాదు’’ అని తెలిపారు.

మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram) రూపొందించిన చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌, ఈశ్వరీ రావు కీలకపాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది విడుదలైంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.94 కోట్లు (గ్రాస్‌) వసూళ్లు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని