Published : 23 Jan 2022 15:11 IST

Navdeep: పెళ్లి చేసుకోమంటూ నెటిజన్ల సలహా.. కౌంటర్‌ ఇచ్చిన నవదీప్‌

హైదరాబాద్‌: హీరో, సహనటుడు, వ్యాఖ్యాతగా ప్రేక్షకుల్ని అలరించిన నటుడు నవదీప్‌. ఒకప్పుడు లవర్‌బాయ్‌ రోల్స్‌లో నటించి మెప్పించిన ఆయన ఇప్పుడు సహాయనటుడిగా ఆకట్టుకుంటున్నారు. గత కొంతకాలం నుంచి సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆద్యంతం ఆస్వాదిస్తున్నారు. ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లడం, వర్కౌట్లు, లాంగ్‌ డ్రైవ్స్, పెట్స్‌తో సరదాగా ఆడుకోవడం.. ఇలా తనకిష్టమైన వ్యాపకాలతో కాలాన్ని గడిపేస్తున్నారు. ఇదిలాఉండగా నవదీప్‌ పెళ్లి కోసం పలువురు నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 35 ఏళ్లు వచ్చాయి పెళ్లి చేసుకోండంటూ నెటిజన్లు తరచూ ఆయనకి సలహాలిస్తున్నారు.

నెటిజన్ల నుంచి వస్తోన్న పెళ్లి కామెంట్లపై తాజాగా నవదీప్‌ స్పందించారు. పెళ్లి చేసుకోమంటూ ఉచిత సలహాలు ఇస్తున్న వారికి ఆయన స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈమేరకు ఆదివారం ఆయన.. ‘‘వద్దురా సోదరా’’ అంటూ వీడియో షేర్‌ చేశారు. ‘‘అన్నా నీ గడ్డం తెల్లబడుతోంది త్వరగా పెళ్లి చేసుకో అని కొంతమంది నాకు సలహాలు ఇస్తున్నారు. గడ్డం తెల్లబడితే చేయాల్సింది ట్రిమ్మింగ్‌.. పెళ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా..!’’ అని నవదీప్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని