Nayanthara: సోదరి పాత్రలో నయన

‘కోమలి’తో దర్శకుడిగా చిత్రరంగంలో అడుగుపెట్టాడు ప్రదీప్‌ రంగనాథన్‌. తన దర్శకత్వంలో వచ్చిన ‘లవ్‌ టుడే’లో హీరోగా నటించి మంచి విజయం అందుకున్నాడు.

Updated : 06 Dec 2023 09:40 IST

‘కోమలి’తో దర్శకుడిగా చిత్రరంగంలో అడుగుపెట్టాడు ప్రదీప్‌ రంగనాథన్‌. తన దర్శకత్వంలో వచ్చిన ‘లవ్‌ టుడే’లో హీరోగా నటించి మంచి విజయం అందుకున్నాడు. అదే పేరుతో టాలీవుడ్‌లో వచ్చిన ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడాయన హీరోగా తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాలో ప్రముఖ అగ్రకథానాయిక, విఘ్నేశ్‌ భార్య నయనతార కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.  నయన ఈ చిత్రంలో ప్రదీప్‌కి సోదరిగా నటించనున్నట్లు తెలుస్తోంది. తన నటనతో అందరినీ ఆకట్టుకునే నయన కోసం దర్శకుడు ఆ పాత్రను ఎంతో అందంగా తీర్చిదిద్దారని తెలిసింది. ‘లియో’ మేకర్స్‌ ఈ సినిమాకోసం సన్నాహాలు చేస్తున్నట్లు, త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని