Nayan-Vignesh: నయన్‌తో పెళ్లి.. విఘ్నేశ్‌ ఆసక్తికర పోస్ట్‌ ..!

కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ విఘ్నేశ్‌ శివన్‌-నయనతారకు ఈ రోజు ఎంతో ప్రత్యేకం. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది.

Updated : 09 Jun 2022 09:58 IST

చెన్నై: కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ విఘ్నేశ్‌ శివన్‌-నయనతారకు ఈ రోజు ఎంతో ప్రత్యేకం. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. మహాబలిపురంలోని షెరిటన్‌ హోటల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విఘ్నేశ్‌ శివన్‌ తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. తన తంగమై నయన్‌ పెళ్లికుమార్తెగా ముస్తాబై వేదికపైకి నడుచుకుంటూ వస్తుంటే చూడటానికి తాను ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు.

‘‘ఈ రోజు జూన్‌ 9 అంటే ఈరోజు నయన్‌ డే. భగవంతుడు, విశ్వం, నా జీవితంలోని ప్రతిఒక్కరి ఆశీస్సులకు ధన్యవాదాలు..!! మంచి వ్యక్తులు, సమయాలు, అనుకోని మధుర సంఘటనలు, ఆశీస్సులు, షూటింగ్‌ రోజులు, దేవుడి ప్రార్థనలు.. నా జీవితం ఇంత అందంగా ఉండటానికి ఇవే కారణం. ఇక ఇప్పుడు లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌ నయన్‌కు దీన్ని అంకితం చేస్తున్నాను. మై తంగమై..  నువ్వు పెళ్లి కుమార్తెగా ముస్తాబై వేదికపైకి రావడాన్ని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో జీవితంలోని కొత్త అంకాన్ని ప్రారంభించేందుకు ఆనందంగా ఉన్నా’’ అని విఘ్నేశ్‌ శివన్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌  వైరల్‌గా మారింది. అది చూసిన సినీ తారలు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని