Negative: అనటోలియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘నెగెటివ్‌’

‘లైఫ్‌లో అందరూ పాజిటివ్‌ వర్డ్స్‌, పాజిటివ్‌ వైబ్స్‌ను ఇష్టపడతారు. కానీ, కొన్నిసార్లు నెగెటివ్‌ వర్డ్‌ను కూడా ఇష్టపడతారు’ అంటున్నారు

Updated : 17 Dec 2021 16:18 IST

హైదరాబాద్‌: ‘లైఫ్‌లో అందరూ పాజిటివ్‌ వర్డ్స్‌, పాజిటివ్‌ వైబ్స్‌ను ఇష్టపడతారు. కానీ, కొన్నిసార్లు నెగెటివ్‌ వర్డ్‌ను కూడా ఇష్టపడతారు’ అంటున్నారు యువ దర్శకుడు బాల సతీష్‌. ఆయన దర్శకత్వంలో విక్రమ్ శివ, ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ శ్వేత వర్మ, దయానందరెడ్డి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘నెగెటివ్‌’. తాజాగా ఈ చిత్రం ‘అనటోలియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’, ‘కలకారి ఫిల్మ్ ఫెస్టివల్’, ‘ది లిఫ్ట్-ఆఫ్ సెషన్స్ ఆన్‌లైన్ అండ్‌ ఫస్ట్ టైమ్ ఫిల్మ్ మేకర్ సెషన్స్ లిఫ్ట్-ఆఫ్ గ్లోబల్ నెట్‌వర్క్, ఫిల్మ్‌ ఇంటర్నేషనల్ స్టోరికల్ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌’లకు అధికారికంగా ఎంపికైంది.  ఫిలోమినా ఇన్ఫోటైన్‌మెంట్స్ బ్యానర్ మీద ఏఎం రాజేశ్‌ కుమార్ నిర్మించిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ అవార్డులను అందుకుంటూ విజయపథంలో దూసుకెళ్తోంది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని