Nithiin-Ram : హిందీలో రామ్‌, నితిన్ హవా.. అరుదైన రికార్డు నెలకొల్పిన యువ హీరోలు

టాలీవుడ్‌ హీరోలు రామ్‌ పోతినేని, నితిన్‌ బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. వారి ఆదరణతో యూట్యూబ్‌లో అరుదైన రికార్డు నెలకొల్పారు.

Published : 28 Feb 2022 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ హీరోలు రామ్‌ పోతినేని, నితిన్‌ ఇక్కడివారినే కాదు బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. వారి ఆదరణతో యూట్యూబ్‌లో అరుదైన రికార్డు నెలకొల్పారు. తెలుగులో మంచి టాక్‌ తెచ్చుకున్న చిత్రాలు ఇతర భాషల్లో డబ్‌ అయి, యూట్యూబ్‌ వేదికగా విడుదలవుతుంటాయనే విషయం తెలిసిందే. అలా రామ్, నితిన్‌ నటించిన చాలా సినిమాలు హిందీలోకి డబ్‌ అయ్యాయి. వీటికి ఉత్తరాది ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. నితిన్‌ సినిమాలన్నీ కలిపి 2.3 బిలియన్‌కిపైగా ( 200 కోట్లకుపైగా) వీక్షణలు సొంతం చేసుకోగా రామ్‌ చిత్రాలు 2 బిలియన్‌ వ్యూస్‌ దక్కించుకున్నాయి. హిందీ ప్రేక్షకుల్లో ఈ ఇద్దరి హీరోలకు ఎంతటి క్రేజ్‌ ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. యూట్యూబ్‌ వేదికగా తెలుగు సినిమాలకు ఈ స్థాయిలో ఆదరణ దక్కడం విశేషం. దాంతో అటు నితిన్‌ అభిమానులు, ఇటు రామ్‌ అభిమానులు ఖుషీ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

నితిన్‌ ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం’ అనే పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా సినిమాలో నటిస్తున్నారు. ఎం.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయిక. రామ్‌.. ‘వారియర్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రానికి లింగుస్వామి దర్శకుడు. రామ్‌ సరసన కృతిశెట్టి సందడి చేయనుంది. మరోవైపు, దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ పాన్‌ ఇండియా చిత్రం ప్రకటించారు రామ్‌. ఈ సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని నేరుగా పలకరించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని