‘101 జిల్లాల అందగాడు’ వచ్చేస్తున్నాడు

అవసరాల శ్రీనివాస్‌ కథానాయకుడుగా విద్యాసాగర్‌ రాచకొండ తెరకెక్కిస్తున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రుహాని శర్మ నాయిక. వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను మే 7న విడుదల చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది చిత్రబృందం.

Published : 17 Feb 2021 21:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవసరాల శ్రీనివాస్‌ కథానాయకుడుగా విద్యాసాగర్‌ రాచకొండ తెరకెక్కిస్తున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రుహాని శర్మ నాయిక. వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాను మే 7న విడుదల చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది చిత్రబృందం. శిరీష్‌, రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు క్రిష్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శక్తికాంత్ కార్తీక్‌, ఛాయాగ్రహణం: రామ్‌, కళ: రామాంజనేయులు, కూర్పు: కిరణ్‌ గంటి. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని