ott movies: ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

ott movies: ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేచిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే!

Published : 12 Jan 2023 16:14 IST

ప్రస్తుతం థియేటర్‌లో సంక్రాంతి సినిమాల సందడి కొనసాగుతోంది. అగ్ర కథానాయకుల చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  మరోవైపు ఓటీటీలో కొత్త చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమయ్యాయి.

కానిస్టేబుల్ లాఠీపడితే..

విశాల్‌ కథానాయకుడిగా వినోద్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పోలీస్‌ యాక్షన్‌ డ్రామా ‘లాఠీ’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సంక్రాంతి కానుకగా జనవరి 14న సన్‌నెక్ట్స్‌ వేదికగా తమిళ/తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.


హిందీ ‘దృశ్యం2’ అందరికీ..

గతేడాది హిందీ పరిశ్రమలో మంచి విజయాన్ని అందుకున్న మిస్టరీ థ్రిల్లర్‌ ‘దృశ్యం2’. అజయ్‌ దేవగణ్‌, శ్రియ, టబు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ రూ.100కోట్ల క్లబ్‌ను దాటింది. ఇప్పటికే అద్దె ప్రాతిపదికన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా జనవరి 13వ తేదీ నుంచి ప్రైమ్‌ చందాదారులు ఉచితంగా వీక్షించవచ్చు.


ఓటీటీలో వచ్చే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

📺 హంటర్స్‌ (వెబ్‌ సిరీస్‌) జనవరి 13


జీ5

📺 హెడ్‌ బుష్‌ (తెలుగు డబ్బింగ్‌) జనవరి 13

📺 తట్టస్సెరి కూట్టం (మలయాళం) జనవరి 13


డిస్నీ+హాట్‌స్టార్‌

📺 ముకుందన్‌ ఉన్ని అసోసియేట్స్‌ (మలయాళం) జనవరి 13


నెట్‌ఫ్లిక్స్‌

📺 వైకింగ్స్‌: వల్హల్లా (వెబ్‌సిరీస్‌) జనవరి 12

📺 బ్రేక్‌ పాయింట్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 13

📺 డాగ్‌ గాన్‌ (హాలీవుడ్‌) జనవరి 13

📺 ట్రయల్‌ బై ఫైర్‌ (హిందీ) జనవరి 13

📺 స్కై రోజో (స్పానిష్‌) జనవరి 13

📺 కుంగ్‌ఫూ పాండా: ది డ్రాగన్‌ నైట్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 12

📺 వరలరు ముఖ్యం (తమిళ్‌) జనవరి 15


లయన్స్‌ గేట్‌ ప్లే

* లంబోర్గిని: ద మ్యాన్‌బిహైండ్‌ ద లెజెండ్‌ (హాలీవుడ్)జనవరి 13

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని