Ott movies this week: ఈ వారం థియేటర్‌లో కొత్త సినిమాల్లేవ్‌... ఓటీటీలో ఏకంగా 22 చిత్రాలు/సిరీస్‌లు

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల హవా ఈ వారమూ కొనసాగనుంది. ‘హను-మాన్‌’, ‘గుంటూరుకారం’, ‘సైంధవ్‌’, ‘నా సామిరంగ’ చిత్రాలు మరో పదిరోజుల పాటు థియేటర్‌లో అలరించనున్నాయి. అయితే, ఓటీటీలో మాత్రం సరికొత్త చిత్రాలు, సిరీస్‌ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్‌ కానుందో చూసేయండి.

Published : 16 Jan 2024 13:50 IST

ఓటీటీలో వచ్చేస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌

కార్తీక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘అథర్వ’. సిమ్రాన్‌ చౌదరి, ఐరా కథానాయికలు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. డిసెంబరు 1న  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌  వేదికగా జనవరి 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.  నేర నేపథ్యం, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన ఈ కథ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా కథ, కథనాలను తీర్చిదిద్దారు.  (రివ్యూ కోసం క్లిక్‌ చేయండి)


నితిన్‌ యాక్షన్‌ కామెడీ మూవీ

నితిన్‌ (Nithiin) హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ (Extra Ordinary Man). డిసెంబరు 8న విడుదలైన ఈ సినిమాలో నితిన్‌ నటన, వినోదం ఆకట్టుకున్నా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇప్పుడీ యాక్షన్‌ కామెడీ చిత్రం ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. జనవరి 19 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా అందుబాటులోకి రానుంది. ఇందులో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించగా.. రాజశేఖర్‌ ఓ కీలక పాత్రలో నటించారు. (రివ్యూ కోసం క్లిక్‌ చేయండి)


పోలీస్‌ యాక్షన్ హంగామా

పోలీస్‌ కథలతో తరచూ ప్రేక్షకులను అలరిస్తుంటారు బాలీవుడ్‌ దర్శకుడు రోహిత్‌ శెట్టి (Rohit Shetty). తాజాగా ఆయన తెరకెక్కించిన పవర్‌ఫుల్‌ పోలీస్‌ సిరీస్‌ ‘ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌’ (Indian Police Force). సిద్ధార్థ్‌ మల్హోత్ర, శిల్పాశెట్టి, వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌ ఒరిజినల్‌గా సిద్ధమైన ఈ సిరీస్‌ జనవరి 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.  దాదాపు ఏడు ఎపిపోడ్స్‌తో సిద్ధమైన ఈ సిరీస్‌కు రోహిత్‌శెట్టితోపాటు సుశ్వంత్ ప్రకాష్ దర్శకుడిగా వ్యవహరించారు.

ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

  • నెట్‌ఫ్లిక్స్‌
  • డస్టీ స్లే -వర్కిన్‌ మ్యాన్‌ (ఇంగ్లీష్‌) జనవరి 16
  • అమెరికన్‌ నైట్‌మేర్‌ (ఇంగ్లీష్‌) జనవరి 17
  • మెర్రీ మ్యాన్‌3 (ఇంగ్లీష్‌) జనవరి 18
  • ఫుల్‌ సర్కిల్‌ (ఇంగ్లీష్‌) జనవరి 19
  • లవ్‌ ఆన్‌ ది స్పెక్ట్రామ్‌ అజ్‌ సీజన్‌-2 (ఇంగ్లీష్‌)  జనవరి 19
  • ది కిచెన్‌ (ఇంగ్లీష్‌) జనవరి 19
  • లయన్స్‌ గేట్‌ ప్లే
  • టు సిన్నర్స్‌ అండ్‌ ఏ మ్యూల్‌ (ఇంగ్లీష్‌) జనవరి 19
  • ది కాంట్రాక్టర్‌ (ఇంగ్లీష్‌) జనవరి 19
  • సోనీలివ్‌
  • వేర్‌ ది క్రాడెడ్స్‌ సింగ్‌ (ఇంగ్లీష్‌) జనవరి 19
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • డెత్‌ అండ్‌ అదర్‌ డీటెల్స్‌ (ఇంగ్లీష్‌) జనవరి 16
  • ఏ షాప్‌ ఫర్‌ కిల్లర్స్‌ (కొరియన్‌) జనవరి 17
  • కోలీన్‌ రూనే - ది రియల్‌ వగ్తా స్టోరీ (ఇంగ్లీష్‌) జనవరి 19
  • స్నేక్స్‌ ఎస్‌ఓఎస్‌ - గోవాస్‌ వైల్డెస్ట్‌ సీజన్‌-4 (ఇంగ్లీష్‌) జనవరి 20
  • జియో సినిమా
  • బ్లూ బీటెల్‌ (ఇంగ్లీష్‌) జనవరి 18
  • చికాగో ఫైర్‌: సీజన్‌ 12 (ఇంగ్లీష్‌) జనవరి 18
  • లా అండ్‌ ఆర్డర్‌: స్పెషల్‌ విక్టిమ్స్‌ యూనిట్‌ సీజన్‌ 25 (ఇంగ్లీష్‌) జనవరి 18
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
  • మాయలో (తెలుగు) స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • హజ్బిన్‌ హోటల్‌ (ఇంగ్లీష్‌) జనవరి 19
  • లాల్‌ - లాస్ట్‌ వన్‌ లాఫింగ్‌ ఐర్లాండ్‌ (ఇంగ్లీష్‌) జనవరి 19
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని