Pakka Commercial: ఓటీటీలోకి ‘పక్కా కమర్షియల్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

గోపీచంద్‌ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. జులై 1న థియేటర్లలో విడుదలై సందడి చేసిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది.

Published : 31 Jul 2022 11:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గోపీచంద్‌ (Gopichand) హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’ (Pakka Commercial). జులై 1న థియేటర్లలో విడుదలై సందడి చేసిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ‘ఆహా’లో (Aha) ఆగస్టు 5 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ ట్విటర్‌లో ఓ గ్లింప్స్‌ను విడుదల చేసింది. అదే రోజు మరో ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లోనూ (Netflix) ఈ సినిమా విడుదల కానుందని సమాచారం. ‘ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీకి రాదు’ అని చెప్పిన చిత్ర బృందం ఇంత త్వరగా ఓటీటీలో విడుదల చేస్తుండటం గమనార్హం. యాక్షన్- కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో గోపీచంద్‌, కథానాయిక రాశీఖన్నా (Raashi Khanna) లాయర్లుగా నటించారు. సత్యరాజ్‌, రావు రమేష్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

క‌థేంటంటే: సూర్య‌నారాయ‌ణ (స‌త్య‌రాజ్‌) ఓ న్యాయ‌మూర్తి. స‌రైన సాక్ష్యాధారాలు లేక‌పోవ‌డంతో చేసేదేమీ లేక ఓ కేసులో బాధితురాలికే జ‌రిమానా విధిస్తాడు. నేరం చేసిన వివేక్ (రావు ర‌మేష్‌) ఆ కేసులో గెలుస్తాడు. బాధితురాలికి న్యాయం చేయ‌లేక‌పోయాన‌ని కుమిలిపోతాడు సూర్య‌నారాయ‌ణ‌. నిందితుల‌కే న్యాయం జ‌రుగుతుండ‌టాన్ని చూసి జీర్ణించుకోలేని ఆయ‌న త‌న వృత్తి నుంచి వైదొలుగుతాడు. కిరాణాకొట్టుని న‌డుపుతూ జీవితం సాగిస్తుంటాడు. సూర్య‌నారాయ‌ణ కొడుకు ల‌క్కీ (గోపిచంద్‌) కూడా తండ్రిలాగే న‌ల్ల‌కోటే ధ‌రిస్తాడు. కాక‌పోతే తండ్రిలా కాదు, ఇత‌ను ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లాయ‌ర్‌. డ‌బ్బు కోసం విలువ‌ల్ని సైతం ప‌క్క‌న‌పెడ‌తాడు. ఓ కేసు విష‌యంలో తండ్రీ కొడుకుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ త‌లెత్తుతుంది. బాధితుడి ప‌క్షాన నిల‌వ‌డం కోసం ఎప్పుడో వ‌దిలిపెట్టిన న‌ల్ల‌కోటుని మ‌ళ్లీ ధ‌రిస్తాడు సూర్య‌నారాయ‌ణ‌. త‌న కొడుకుతోనే కోర్టులో పోరాటానికి దిగుతాడు. మ‌రి ఈ వైరం ఎక్క‌డిదాకా సాగింది? చివ‌రికి విలువ‌ల్నే న‌మ్ముకున్న తండ్రి గెలిచాడా లేక‌, ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అయిన త‌న‌యుడు గెలిచాడా? తాను న‌టిస్తున్న సీరియ‌ల్ కోసం లా కూడా చ‌దివేసిన లాయ‌ర్ ఝాన్సీ (రాశీఖన్నా) క‌థేమిటన్న‌ది మిగ‌తా సినిమా.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని