Published : 25 Jun 2022 16:00 IST

Parampara2: పరంపర మళ్లీ వస్తోంది.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచంటే?

హైదరాబాద్‌: గతేడాది నెటిజన్లను అమితంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో ‘పరంపర’ ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయిన ఈ వెబ్‌సిరీస్‌కు ఇప్పుడు కొనసాగింపు రానుంది. ‘పరంపర2’(Parampara2)గా వస్తున్న ఈ భాగం జులై 21 నుంచి అందుబాటులోకి రానుంది. నవీన్‌ చంద్ర, జగపతిబాబు, శరత్‌కుమార్‌, ఆకాంక్షసింగ్, ఇషాన్‌ వెంకటేశ్‌ కీలక పాత్రలో నటించారు.

‘సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా?లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? వంటి విషయాలకు ‘పరంపర’ సమాధానాలు లభించాయి.  మరి కొత్త సిరీస్‌లో ఆధిపత్యపోరు ఎలా ఉంటుందో చూడాలి. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని