Pawan Kalyan: కొబ్బరికాయ కొట్టేశారు
పవన్ కల్యాణ్ - సుజీత్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
పవన్ నూతన చిత్రం ప్రారంభం
పవన్ కల్యాణ్ - సుజీత్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. సురేష్‌బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. దిల్‌రాజు, అరవింద్ దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందించారు. ఇదొక భారీ యాక్షన్ డ్రామా సినిమా. ఇందులో పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు తెలిసింది. ‘‘ఇటు యాక్షన్ ప్రియులకు, అటు పవన్ అభిమానులకు ఇది పండుగలాంటి చిత్రమ’’ని నిర్మాత దానయ్య ప్రకటించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్, శ్రీవాస్, వివేక్ ఆత్రేయ, బీవీఎస్‌ఎన్ ప్రసాద్, ఏఎం రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, ఛాయాగ్రహణం: రవి కె.చంద్రన్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
TATA IPL 2023: ఐపీఎల్ వ్యాఖ్యాతగా నందమూరి బాలకృష్ణ
-
Politics News
Azad: రాహుల్‌పై వేటు: ఇలాగైతే.. పార్లమెంట్, అసెంబ్లీలు ఖాళీయే: ఆజాద్
-
Sports News
MIW vs DCW: ముగిసిన దిల్లీ ఇన్నింగ్స్.. ముంబయి లక్ష్యం 132
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
OneWeb: వన్‌వెబ్ కాన్స్టలేషన్ సంపూర్ణం.. కక్ష్యలోకి 618 ఉపగ్రహాలు
-
Sports News
wWBC: మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో లవ్లీనాకు స్వర్ణం