Pelli SandaD: ‘పెళ్లిసందD’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

భారీ బడ్జెట్‌ చిత్రాలైనా, పాన్‌ ఇండియా సినిమాలైనా థియేటర్లో విడుదలైన 2- 3 నెలల్లోనే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అలాంటిది ‘పెళ్లి సందD’  చిత్రం గతేడాది అక్టోబరులో థియేటర్లలో సందడి చేసినా ఓటీటీలోకి రాలేదు.

Updated : 21 Jun 2022 20:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారీ బడ్జెట్‌ చిత్రాలైనా, పాన్‌ ఇండియా సినిమాలైనా థియేటర్లో విడుదలైన 2- 3 నెలల్లోనే ఓటీటీకి వచ్చేస్తున్న తరుణమిది. అలాంటిది ‘పెళ్లి సందD’ (Pelli SandaD) చిత్రం గతేడాది అక్టోబరులో థియేటర్లలో సందడి చేసినా ఓటీటీలోకి రాలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల ఖరారైంది. ఈ చిత్రం ‘జీ 5’లో జూన్‌ 24 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి గౌరీ రోణంకి దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. కథానాయికగా శ్రీలీల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని