RRR: ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ పిల్‌.. కొట్టేసిన హైకోర్టు

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అల్లూరి సీతారామరాజు, కుమ్రంభీం చరిత్రను వక్రీకరించారంటూ అల్లూరి సౌమ్య...

Published : 15 Mar 2022 22:13 IST

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అల్లూరి సీతారామరాజు, కుమ్రంభీం చరిత్రను వక్రీకరించారంటూ అల్లూరి సౌమ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్‌ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. అల్లూరి సీతారామరాజును పోలీసుగా చూపి చరిత్రను వక్రీకరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అల్లూరి, కుమ్రంభీం దేశభక్తులుగానే చూపామన్న దర్శక, నిర్మాతలు... ఆర్ఆర్ఆర్ కేవలం కల్పిత కథేనని కోర్టుకు వివరించారు. సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కూడా జారీ చేసిందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. ప్రజా ప్రయోజన వ్యాజ్యం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. సినిమాతో అల్లూరి సీతరామరాజు, కుమ్రంభీం పేరుప్రఖ్యాతులకు ఎలాంటి భంగం కలగదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని