Pooja Hegde: బుట్టబొమ్మ మరోసారి బిజీ కానుందా..!

హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించిన రెండు వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Published : 15 Mar 2024 17:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండేళ్ల క్రితం వరుస సినిమాలతో అలరించారు హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja Hegde). తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అగ్ర హీరోలతో నటించి మెప్పించిన ఈ పొడుగు కాళ్ల సుందరి ఇప్పుడు మరోసారి బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో పూజాకు సంబంధించిన రెండు వార్తలు తెగ షేర్ అవుతున్నాయి. 

అల్లు అర్జున్‌ సరసన మరోసారి!

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్‌ (Allu Arjun), అట్లీ దర్శకత్వంలో నటించనున్నారని ఎప్పటినుంచో కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ప్రాజెక్ట్‌ గురించి అట్లీ మాట్లాడుతూ.. ‘బన్నీకి కథ చెప్పా. చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మంచి విషయం చెబుతాను’ అన్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో పూజాహెగ్డేకు అవకాశం ఇచ్చారని జోరుగా ప్రచారమవుతోంది. గతంలో వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘అల వైకుంఠపురములో’ సూపర్‌ హిట్టైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్‌ రిపీట్ కానున్నట్లు వార్తలు రావడంతో సినీప్రియులు సంబరపడుతున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మమ్మల్ని అర్థం చేసుకోండి.. ‘హనుమాన్‌’ ఓటీటీ రిలీజ్‌పై దర్శకుడి పోస్ట్‌

సమంత స్థానంలో పూజా!

నందినీరెడ్డి దర్శకత్వంలో సిద్దూ జొన్నలగడ్డ  (Siddu Jonnalagadda) హీరోగా ఓ ప్రాజెక్ట్‌ రూపొందనున్న విషయం తెలిసిందే. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మొదట సమంతను హీరోయిన్‌గా అనుకున్నారట. అయితే, ఆమె ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించడంతో ఆమె స్థానంలో పూజా హెగ్డేను తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా పూజా అన్ని భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు.  అందుకే సమంత (Samantha) ఛాన్స్ ఈమెకు ఇస్తున్నట్లు టాక్‌. 

గతేడాది ‘కిసీ కా భాయ్‌.. కిసీ కి జాన్‌’ సినిమాతో పలకరించారు పూజా హెగ్డే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని