
Pooja Hegde: లగేజీ పోగొట్టుకున్న పూజాహెగ్డే.. రెడ్ కార్పెట్‌పైకి ఎలా వెళ్లిందంటే?
ఇంటర్నెట్‌డెస్క్: ప్రతిష్టాత్మక ‘కేన్స్’ చలన చిత్రోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు ఖరీదైన దుస్తులు, నగలు ధరించి ఎర్రతివాచీపై హొయలొలికిస్తున్నారు. భారతదేశం తరఫున ఊర్వశి రౌతెలా, మాధవన్, కమల్ హాసన్, ఎ.ఆర్. రెహమాన్, తమన్నా, పూజాహెగ్డే తదితరులు పాల్గొన్నారు. తొలిసారి కేన్స్‌కు హాజరైన పూజాహెగ్డేకు ఆనందంతోపాటు బాధా తోడైంది. తనెంతో ఇష్టంగా తీసుకెళ్లిన మేకప్ కిట్ తదితర వస్తువులను పోగొట్టుకోవడమే ఇందుకు కారణం. ఆ సంఘటనల గురించి పూజా ఓ ఆంగ్ల పత్రికకు సంబంధించిన ఇంటర్వ్యూలో తెలిపారు.
‘‘విమాన ప్రయాణానికి రెండు బ్యాగులను అనుమతించకపోవడంతో ఒకదాన్ని భారత్‌లోనే వదిలేయాల్సి వచ్చింది. అలా ఒక్క బ్యాగ్‌తోనే ఫ్రాన్స్‌కు బయలుదేరా. ఈ ప్రయాణంలో అదీ పోయింది. నా దుస్తులు, హెయిర్ ప్రొడక్ట్స్, మేకప్ కిట్, అన్నీ అందులోనే ఉన్నాయి. రెడ్ కార్పెట్‌పైకి వెళ్లేందుకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ నాలో ఒత్తిడి పెరిగింది. అప్పుడేం చేయాలో నాకు అర్థం కాలేదు. ఏడ్చేందుకూ సమయం లేదు. ఏం ఫర్వాలేదనుకుని బాధను దూరంపెట్టి ఫ్రాన్స్‌లో అప్పటికప్పుడు కొత్త డ్రెస్సు తీసుకున్నా. నా టీమ్.. హెయిర్, మేకప్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు. జ్యువెలరీ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోవడం మంచిదనిపించింది. వెంటనే రెడీ అయి వేడుకకు హాజరయ్యా. ఈ పరిణామాల వల్ల మేం ఉదయం నుంచి రాత్రి వరకు ఏం తినలేదు. రెడ్ కార్పెట్‌పై మెరిసిన అనంతరం డిన్నర్ చేశాం. ఈ అనుభవాన్ని, నా టీమ్ అందించిన ప్రోత్సాహాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను’’ అని పూజాహెగ్డే పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: ధాటిగా ఆడుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు.. అప్పుడే 50 పరుగులు కొట్టేశారు
-
India News
Agnipath: నేవీలో అగ్నిపథ్ నియామకాలు.. 10వేల మంది మహిళల దరఖాస్తు
-
Politics News
Uddhav Thackeray: తప్పెవరిదో వాళ్లే చెప్తారు.. ప్రజా కోర్టులో తేల్చుకుందాం రండి: ఉద్ధవ్ సవాల్
-
Business News
SSY: సుకన్య సమృద్ధి యోజన ఖాతా గురించి సందేహాలా?.. సమాధానాలివిగో..!
-
General News
CM Jagan: విభజన వల్ల దెబ్బతిన్నాం.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించండి: మోదీకి జగన్ వినతి
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా రెండో 245 ఆలౌట్.. ఇంగ్లాండ్ లక్ష్యం 378
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు