Prabhas-Yash: సెలబ్రేషన్స్‌లో యంగ్‌ రెబల్‌ స్టార్‌, రాకింగ్‌ స్టార్‌.. వీడియో వైరల్‌!

‘కేజీయఫ్‌’తో కన్నడ స్టార్‌హీరో యశ్‌కు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ని అందించారు దర్శకుడు ప్రశాంత్‌నీల్‌. ఆ సినిమా సక్సెస్‌తో ప్రశాంత్‌నీల్‌ స్టార్‌ డైరెక్టర్‌గా ప్రపంచదేశాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుత....

Published : 04 Jun 2022 09:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కేజీయఫ్‌’తో కన్నడ స్టార్‌హీరో యశ్‌కు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ని అందించారు దర్శకుడు ప్రశాంత్‌నీల్‌. ఆ సినిమా సక్సెస్‌తో ప్రశాంత్‌నీల్‌ స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్‌’. పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ హీరోగా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కాగా, ఈ స్టార్‌ డైరెక్టర్‌తో టీమ్‌ అప్‌ అయిన ఈ ఇద్దరు క్రేజీ హీరోలూ తాజాగా ఒకేచోట కలిశారు. ఓ పార్టీలో పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆ పార్టీ ఏమిటంటే.. ప్రశాంత్‌నీల్‌ బర్త్‌డే.

జూన్‌ 4న ప్రశాంత్‌ నీల్‌ పుట్టినరోజు. దీంతో శుక్రవారం రాత్రి ప్రభాస్‌, యశ్‌ ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపారు. బెంగళూరులో జరిగిన ఈ వేడుకల్లో ప్రభాస్‌, యశ్‌ సందడి చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ ట్విటర్‌ వేదికగా కొన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ‘‘భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు డైనమైట్స్‌ (ప్రభాస్‌, యశ్‌) తమ షో మ్యాన్‌ ప్రశాంత్‌నీల్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు ఒకే చోట కలిశారు. ఈ సెలబ్రేషన్స్‌ కోసం డార్లింగ్‌ ప్రభాస్‌ హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వచ్చారు’’ అని నిర్మాణ సంస్థ రాసుకొచ్చింది. ఇదే పార్టీలో ‘కేజీయఫ్‌-2’ 50 రోజుల వేడుకలు కూడా జరిగాయి. ఈ పార్టీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట అందర్నీ ఆకట్టుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని