Prabhas: ‘సలార్‌’@500 కోట్లు.. తొలి దక్షిణాది నటుడిగా ప్రభాస్‌ రికార్డు

డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్‌’ (Salaar) భారీ వసూళ్లను సొంతం చేసుకుంటోంది. దీంతో ప్రభాస్‌ రికార్డును సృష్టించారు.

Updated : 28 Dec 2023 18:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాజా హిట్ ‘సలార్‌’ వసూళ్లతో ప్రభాస్ (Prabhas) రికార్డు సృష్టించారు. ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ఆయన నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తాజాగా విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడి ఎలివేషన్స్‌కు ప్రభాస్‌ యాక్షన్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తోంది.

డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సలార్‌’ ఆరు రోజుల్లో రూ.500కోట్ల క్లబ్‌లో చేరింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డులు నెలకొల్పిన ఈ చిత్రం విడుదలైన తొలిరోజు నుంచి భారీ వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ఇక ఈ సినిమాతో ప్రభాస్‌ కూడా మరో రికార్డును సొంతం చేసుకున్నారు. మూడు సినిమాల్లో  రూ. 500 కోట్ల చొప్పున రాబట్టిన ఏకైక దక్షిణాది నటుడిగా ప్రభాస్‌ నిలిచారు. గతంలో ఆయన నటించిన ‘బాహుబలి’, ‘బాహుబలి2’ తర్వాత ‘సలార్‌’ ఆ స్థాయి కలెక్షన్లను సొంతం చేసుకుంది. దీంతో ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. ఎలాంటి ముందస్తు వేడుకలు నిర్వహించకుండా విడుదలైన ‘సలార్‌’ సూపర్ హిట్ కావడంతో  హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నన్ను క్షమించండి.. వైరల్‌ వీడియోపై స్పందించిన విశాల్‌

ప్రస్తుతం ప్రేక్షకులంతా ‘సలార్‌’ రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నారు. ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ చివర్లో పార్ట్‌2 ఉండనుందని చిత్రబృందం చెప్పింది. ‘శౌర్యాంగ ప‌ర్వం’పేరుతో ఇది రానున్నట్లు తెలిపింది. అలాగే, ‘సలార్’ విజయంపై ఇంటర్వ్యూలు ఇస్తోన్న నటీనటులు పార్ట్‌2పై కూడా అంచనాలు పెంచేస్తున్నారు. ప్రభాస్‌ దీని గురించి మాట్లాడుతూ.. ‘శౌర్యాంగ ప‌ర్వం’ అద్భుతంగా ఉంటుందని. అందరికీ నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. సలార్‌ సెకండ్‌ పార్ట్‌ మరో స్థాయిలో ఉంటుందని నటి శ్రియా రెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు