Kalki 2898AD: ప్రభాస్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్‌ ఎప్పుడంటే..?

ప్రభాస్‌ (Prabhas) ఫ్యాన్స్‌కు వైజయంతి మూవీస్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. కొత్త సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసింది.

Published : 12 Jan 2024 12:57 IST

హైదరాబాద్‌: సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రభాస్‌ (Prabhas) అభిమానులకు వైజయంతి మూవీస్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ‘కల్కి 2998 ఏడీ’ (Kalki 2898 AD) రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది. వేసవి కానుకగా మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. ‘‘6000 సంవత్సరాల క్రితం ముగిసిన కథ.. 2024 మే 9 నుంచి ప్రారంభం కానుంది’’ అని ట్వీట్‌ చేసింది. ప్రభాస్‌ కొత్త పోస్టర్‌ షేర్‌ చేసింది. దీనిపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రివ్యూ: గుంటూరు కారం.. మహేశ్‌-త్రివిక్రమ్‌ మేజిక్‌ రిపీట్‌ అయిందా?

సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలోనే ‘కల్కి 2898 ఏడీ’ రూపుదిద్దుకుంటోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశాపటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా సెట్స్‌తో పాటు ఆయుధాలు, ఇతర వస్తువులు సరికొత్తగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకూ భారతీయ సినిమా పరిశ్రమ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని