Pawan Kalyan: పరుగులు పెడుతున్న ‘ఓజీ’

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమాల ముచ్చట్లు బోలెడన్ని వినిపిస్తున్నాయి. తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ లుక్‌ విడుదలకి ముహూర్తం కుదిరిందని...

Updated : 29 Apr 2023 06:54 IST

పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమాల ముచ్చట్లు బోలెడన్ని వినిపిస్తున్నాయి. తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్న ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ లుక్‌ విడుదలకి ముహూర్తం కుదిరిందని... సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకి పేరు ఖరారైందని ఇలా బోలెడన్ని ముచ్చట్లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిపై చిత్రబృందాలు అధికారికంగా స్పందించడం లేదు. మరోవైపు పవన్‌కల్యాణ్‌ తన కొత్త చిత్రం ‘ఓజీ’ (OG)ని ముంబయిలో పరుగులు పెట్టిస్తున్నారు. సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే మొదలైంది. ముంబయిలో వారం రోజులుగా చిత్రీకరణ సాగుతోంది. ఈ షెడ్యూల్‌ని మరో వారం రోజులపాటు కొనసాగనున్నట్టు తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌తోపాటు, కథానాయిక ప్రియాంక మోహన్‌ కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. శుక్రవారం ఈ సినిమా సెట్స్‌పైకి ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) అడుగుపెట్టారని సినీ వర్గాలు తెలిపాయి. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని