Prithviraj: ‘సలార్‌’లో హింసాత్మక సన్నివేశాలు.. స్పందించిన పృథ్వీరాజ్‌

సినిమాల్లో హింస ఎంత మేరకు ఉండాలో నిర్ణయించే పూర్తి స్వేచ్ఛ దర్శకులకు ఉండాలని నటుడు పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran) అన్నారు.

Updated : 25 Dec 2023 17:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల విడుదలైన యాక్షన్‌ సినిమాలు ‘యానిమల్‌’(Animal), ‘సలార్‌’ రెండూ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రాల్లో హింస ఎక్కువగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా దీనిపై నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్‌ (Prithviraj Sukumaran) స్పందించారు. 

‘‘ప్రతి సినిమా సెన్సార్‌ బోర్డుకు వెళ్తుంది. వాళ్లు ఇచ్చే సర్టిఫికెట్‌ ఆధారంగా.. సినిమాలో ఎలాంటి కంటెంట్‌ ఉందో ఆడియన్స్‌కు అర్థమవుతుంది. సినిమా ఎలా తీయాలనే విషయంలో దర్శకులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. కథకు అవసరమైనదాన్ని ఎక్కడా రాజీపడకుండా అందించాలి. ఇటీవల విడుదలైన ‘యానిమల్‌’ హింసాత్మకంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నేను ఇంకా ఆ సినిమా చూడలేదు. దాని గురించి ప్రస్తుతం మాట్లాడలేను. ఇక ‘సలార్‌’ విషయానికొస్తే.. కొన్ని సన్నివేశాలు హింసాత్మకంగా ఉన్నాయి. అవి ఆ చిత్రానికి అవసరం కాబట్టే దర్శకుడు అలా రూపొందించారు. అవి కథను ముందుకు తీసుకెళ్లాయి. వీటికంటే ‘సలార్‌’లో భావోద్వేగాలు ఎక్కువ. అవి అందరి హృదయాలను హత్తుకుంటాయి. అందుకే నేను దీన్ని ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’తో పోల్చుతాను’’ అని అన్నారు.

ఈ ఏడాదికి ఇవే చివరి సినిమాలు.. ఓటీటీలో అలరించే చిత్రాలు!

ఇక యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘సలార్‌’లో (Salaar)వ‌ర‌ద రాజమ‌న్నార్‌గా పృథ్వీరాజ్‌ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అతడు లేకపోతే ఈ సినిమా లేదని ప్రశాంత్‌నీల్‌ కూడా ఎన్నో ఇంటర్వ్యూల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని