Kanguva: ‘కంగువా’ రిలీజ్‌.. మేమింకా డేట్‌ ఫిక్స్‌ చేయలేదు: నిర్మాత

‘కంగువా’, ‘తంగలాన్‌’ చిత్రాల రిలీజ్‌లను ఉద్దేశించి స్టూడియో గ్రీన్‌ నిర్మాత ధనంజయన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 21 Jan 2024 14:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సూర్య (suriya) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). శివ దర్శకుడు. పీరియాడికల్‌ డ్రామాగా ఇది తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీనిని ఉద్దేశించి నిర్మాత ధనంజయన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది తమ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అన్నారు. ‘‘సినిమా పూర్తి కాకముందే రిలీజ్‌ డేట్‌ ప్రకటించి ఒత్తిడికి గురి కావడం మాకు ఇష్టం లేదు. ఇది ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్‌. 3డీ, సీజీ వర్క్‌కు చాలా సమయం పట్టొచ్చు. అందుకే మేమింకా రిలీజ్‌ డేట్‌ నిర్ణయించలేదు. సూర్య పార్ట్‌ షూట్‌ పూర్తైంది. బాబీ దేవోల్‌పై చిత్రీకరించాల్సినవి, కొంత ప్యాచ్‌ వర్క్‌ మిగిలి ఉంది. 10 భాషల్లో థియేటర్‌ రిలీజ్‌ చేయనున్నాం. ఓటీటీ వెర్షన్‌ విదేశీ భాషల్లోనూ విడుదల చేస్తాం. ప్రస్తుతం మా దృష్టి పోస్ట్‌ ప్రొడెక్షన్‌పై ఉంది’’ అని అన్నారు. కంగ అనే పరాక్రముడి కథతో ‘కంగువా’ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దిశా పఠానీ కథానాయిక.

HanuMan: అయోధ్య రామ మందిరం.. ‘హను-మాన్‌’ విరాళం ఎన్ని కోట్లంటే..?

తమ బ్యానర్‌లో సిద్ధమవుతోన్న మరో ప్రాజెక్ట్‌ ‘తంగలాన్‌’ను ఉద్దేశించి ధనంజయన్ మాట్లాడుతూ..‘‘ఇదొక యూనివర్సల్‌ స్టోరీ. ప్రేక్షకులను అలరించే విధంగా దీనిని తీర్చిదిద్దడం ఓ సవాల్‌. భారీ స్థాయిలో విడుదల చేయాలనుకుంటున్నాం. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ప్రమోషన్స్‌ చేస్తాం. ఉత్తరాదితోపాటు విదేశాల్లో ప్రచారం చేయడానికి విక్రమ్‌ సిద్ధంగా ఉన్నారు. ఫిబ్రవరి నాటికి సినిమా పూర్తైతే దానికి అనుగుణంగా విడుదల చేస్తాం.’’ అని చెప్పారు. విక్రమ్‌ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మాళవికా మోహనన్‌ కథానాయిక.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని